తెలుగు రాష్ట్రాల్లో 'బర్రెలక్క' అనే పేరుతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బర్రెలక్క అసలు పేరు శిరీష.. కానీ తనకు డిగ్రీ చదివిన తర్వాత కూడా ఉద్యోగం లేదు కాబట్టి బర్రెలు కాసుకుంటున్నాను అంటూ వీడియోలు చేసింది. దీంతో ఆమె సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అప్పటి నుంచి ఆమెకు బర్రెలక్క అని పేరు పెట్టారు నెటిజన్లు. ఇదిలా ఉంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థినిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. రాజకీయాల మీద…
రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు హోలీ ఆడుతూ జారిపడి మృతి చెందిన ఘటన రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే.. మృతదేహానికి డబ్బులు ఇవ్వాలని.. లేదంటే ఇచ్చేది లేదని భర్తకు తేల్చిచెప్పాడు. అది ఎవరో కాదు కన్న తండ్రే. ఓ పక్క కన్న కూతురు చనిపోయిందన్న బాధేమీ లేకుండా.. ఆస్పత్రి ఖర్చుకు అయిన డబ్బులు ఇవ్వాలని కిరాతకం చేశారు. అయితే ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో మహిళ మృతదేహాన్ని తన భర్తకు అప్పగించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో భాగంగా కాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అందుకోసమని ఇప్పటికే స్టేడియానికి ఇరుజట్ల చేరుకున్నాయి. కాగా.. స్టేడియంకు వెళ్లే ముందు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో తెలుగులో మాట్లాడుతూ మేము వచ్చేశాం.. ముంబై ఫ్యాన్స్ పదండి ఉప్పల్ కు అంటూ తెలిపారు. గతంలో కూడా ఐపీఎల్ మ్యాచ్ ల…
పాకిస్తాన్ క్రికెట్ జట్లులో భారీ మార్పులు చేర్పులు చేస్తున్నారు. మళ్లీ బాబర్ అజాంను మళ్లీ టీ20 కెప్టెన్ గా ప్రకటించారు. ఇంతకుముందు.. బాబర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత.. షాహిన్ ఆఫ్రిదికి బాధ్యతలు అప్పగించారు. తన కెప్టెన్సీలో అనుకున్నంత విజయాలను సాధించకపోవడంతో బాబర్ కే పగ్గాలు అప్పజెప్పింది. ఇదిలా ఉంటే.. జట్టు హెడ్ కోచ్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎంతో ఎదురుచూస్తుంది. ఇంతకుముందు కోచ్ పదవుల్లో ఉన్న మిక్కీ ఆర్థర్, గ్రాంట్ బ్రాడ్‌బర్న్, ఆండ్రూ…
పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లికొడుకును, పెళ్లి కూతురును ఊరేగించడం, పెళ్లి మండపం దగ్గరం తీసుకెళ్లడం కార్లలో తీసుకెళ్తూ ఉంటారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. బాగా రిచ్ గా ఉండాలని వధూవరులను గుర్రపు రథాల్లో ఊరేగిస్తున్నారు. మాములుగా అయితే.. గుర్రాలకు ముందుగా శిక్షణ ఇస్తుంటారు.. అలాంటి వాటినే ఈ కార్యక్రమాల కోసం వాడుతారు. అయితే ఒక్కోసారి.. గుర్రాలు సౌండ్ కు, మనుషులను చూసి భయపడిపోతాయి. అప్పుడు మన కంట్రోల్ ఉండవు. ఎటు పడితే అటు పరుగెత్తుతాయి. తాజాగా.. అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.
మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సీఎస్కే 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్ లో ఓడిపోయామన్న బాధతో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్‌కు భారీ షాక్ తగిలింది. అతనికి ఐపీఎల్ నిర్వహకులు భారీగా ఫైన్ విధించారు. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయని కారణంతో రూ.12 లక్షల మేర జరిమానా…
విరాట్ కోహ్లీ అంటే చాలా మంది అభిమానులకు ఎంతో ఇష్టం.. కోహ్లీ ఆట చూసేందు కోసం ఎక్కడినుంచైనా వచ్చే వీరాభిమానులు ఉన్నారు. అంతేకాకుండా.. స్టేడియంలో అతని కోసం ఫ్యాన్స్ టీషర్ట్ లు ధరించడం కానీ, అతన్ని స్టైల్ ను ఫాలోవ్వడం చూస్తుంటాం. కొందరైతే చేతులు, మెడ, శరీరం మీద టాటూలు వేసుకున్న పిచ్చి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అలాంటిది.. ఓ వీరాభిమాని కోహ్లీని కలవాలని ఏకంగా, క్రీజులో ఉన్న కోహ్లీ వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి కాళ్లు మొక్కాడు.. అంతేకాకుండా కోహ్లీని కౌగిలించుకున్నాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నె సూపర్ కింగ్స్ గెలుపొందింది. 63 పరుగుల తేడాతో గుజరాత్ పై సీఎస్కే విజయం సాధించింది. కాగా.. గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో చెన్నై బౌలర్ల దాటికి గుజరాత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. గుజరాత్ బ్యాటింగ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన వృద్ధిమాన్ సాహా (21), శుభ్ మాన్ గిల్ (8) పరుగులతో నిరాశపరిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్…
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు సాధించారు. గుజరాత్ ముందు చెన్నై 207 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచారు. చెన్నై బ్యాటింగ్ లో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (46), రచిన్ రవీంద్ర (46) పరుగులతో రాణించారు. ఆ తర్వాత అజింక్యా రహానే (12) పరుగులు చేసి…
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖలు రాశారు. రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డిలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్ధిక శాఖలో పారదర్శకత కోసం తెచ్చిన CFMS వ్యవస్థను నాశనం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో ఉండాల్సిన CFMSను ముఖ్యమంత్రి కార్యాలయం ఆధీనంలోకి తీసుకుంది.. సత్యనారాయణ, ధనుంజయ్ రెడ్డిలు ఇద్దరూ కలిసి నిధులను దారి మళ్లిస్తున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వైసీపీకి మద్దతుగా నిలిచే కాంట్రాక్టర్‌లకు CFMS ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారని…