వివిధ పార్టీల నేతలతో ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా భేటీ అయ్యారు. పార్టీలు అనుసరించాల్సిన నిబంధనలపై చర్చించారు. ఎన్నికల కోడ్ అమలు, ఎన్నికల సాఫీ నిర్వహణపై పార్టీలతో ఏపీ సీఈఓ చర్చించారు. మీటింగ్ అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ మాట్లాడారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఉన్న అభ్యంతరాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అభ్యర్థి ఇంటింటి ప్రచారానికి అనుమతి తీసుకోవాలనడం సరైంది కాదని పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఇలాంటి నిబంధనలు లేవని తెలిపారు.
మన అభివృద్ధి కొనసాగాలంటే జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని కోరారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. పేద వర్గాలను ఓట్ల కోసమే గత పాలకులు చూశారు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటు పడిన ఒకే ఒక్కడు జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. తాను 50 ఏళ్ల నుంచి ఎన్నో పోరాటాలు చేశానని.. అడగకుండానే పేద వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్న నేత జగన్ మోహన్ రెడ్డి…
పార్టీ నిర్వహణ అవసరాలకు రూ.10 కోట్ల విరాళాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ ఉన్నతి కోసం మొదటి నుంచి తన స్వార్జితాన్ని పార్టీ కోసం వెచ్చిస్తూ వస్తున్న పవన్ కల్యాణ్.. ఎన్నికల సందర్భంగా పార్టీ నిర్వహణ కోసం మరోసారి భారీ విరాళాన్ని అందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నంకు విరాళం చెక్కులను అందజేశారు.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో ఇప్పటికే ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి మంచి ఊపు మీదున్నాయి. ఇదిలా ఉంటే.. గత సీజన్ లో చెన్నై, గుజరాత్ మధ్య ఫైనల్ పోరు జరిగింది. ఆ మ్యాచ్ లో చెన్నై ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో.. ఎలాగైనా ఈరోజు…
టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో.. ఆయన పొన్నూరు నియోజకవర్గంలో రోడ్ షో, కార్నర్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ 1983లో ఒక బలమైన భావజాలంతో పుట్టిందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఆశయంతో పుట్టిందని చెప్పారు. అదే విధమైనటువంటి భావజాలంతో ఈరోజు పుట్టిన పార్టీ జనసేన అని అన్నారు. పవన్ కల్యాణ్ ఆశయం, తన ఆశయం ఒకటేనని చెప్పారు.…
ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ ఫీవర్ తారాస్థాయికి చేరుకుంది. కీలక నేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. పార్టీల అధ్యక్షులంతా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మే 13న జరుగనున్న ఎన్నికల కోసం ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించనున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి జనం మద్ధతు కోరబోతున్నారు.
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా.. యువతతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా యువత అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం అని చెప్పారు. ఏ రంగంలో కూడా అడ్డదారిలో విజయాలు రావు.. లక్ష్య సాధనకు అనునిత్యం కృషి చేయాలని పేర్కొన్నారు. ద్రవిడ విశ్యవిద్యాలయంలో తొలగించిన కోర్సులను పునరుద్దరిస్తాం.. కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. మద్యానికి బానిసలైన వారిని విముక్తి చేయడానికి మండలానికో…
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి సమిష్టిగా కలిసి పనిచేసి.. విజయం సాధిద్దామని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సురేష్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో కొండాపురం మండల కన్వీనర్ ఓంకారం అధ్యక్షతన మండలం క్లస్టర్ క్లస్టర్ ఇంచార్జ్ చెరుకూరి వెంకటాద్రి నేతృత్వంలో 5 మంది యూనిట్ ఇన్చార్జీలు 47మంది బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు.
నిబద్ధత, విశ్వాసంతో ముందుకు సాగితే న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థానానికి చేరవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ వై.చంద్రచూడ్ అన్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన ఎస్వీయూ న్యాయశాఖ 10వ వార్షికోత్సవ వేడుకల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఇండియా- ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐదు టెస్టు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ జరుగనుంది. ఈ ఏడాది నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా(CA) బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25కు సంబంధించిన షెడ్యూల్ ఈరోజు విడుదల చేసింది. 1991-92 సీజన్ తర్వాత తొలిసారి ఈ సిరీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌గా మారింది. మొదటి టెస్ట్ పెర్త్ వేదికగానే జరుగనుంది. ఈ సిరీస్ ను పెర్త్ లో ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. మొదటి టెస్ట్ నవంబర్ 22-26 మధ్య జరుగనుంది.