టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఇవాళ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో చంద్రబాబు మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక.. మీ ఇంటికే ఒకటో తేదీనే పింఛన్ ఇచ్చేలా చేస్తామని అన్నారు. పింఛన్ ను నాలుగు వేలు పెంచి ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ముస్లింలకు అండగా నిలిచే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను కాపాడింది టీడీపీయేనని అన్నారు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ ఈ నెల 21న ప్రారంభమైన విషయం తెలిసిందే.. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల కారణంగా తొలి 21 మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే విడుదలైంది. ఈ నేపథ్యంలో మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. బీసీసీఐ (BCCI) ఐపీఎల్ 2024 మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింద
ఎల్లుండి (బుధవారం) నుంచి సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్ర చేపట్టనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 'మేమంతా సిద్ధం' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి మొదలై ఇచ్చాపురం వరకు సాగనుంది. ఈ నెల 27న ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘాట్ వద్ద ప్రార్ధనలు చేసిన అనంతరం మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభించనున్నారు.
ఈసీకి టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఈసీకి అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన సజ్జలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం సలహాదారు పదవి నుంచి సజ్జలను తొలగించాలని పేర్కొన్నారు. సజ్జల ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నేతలా మాట్లాడుతున్నారని తెలిపారు. గత ఐదేళ్ళుగా ప్రభుత్వ సలహాదారుడిలా కాకుండా వైసీపీ కార్యకర్తలా ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా
మందుబాబులకు టీడీపీ అధినేత చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామన్నారు. లోకల్ బ్రాండ్స్ తో వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలుతో తీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో మహిళలతో ముఖాముఖిలో మాట్లాడుతూ.. టీడీపీకి ఓటు వేస్తేనే భర్తలకు అన్నం పెట్టాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా.. కుప్పంలో లక్ష మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు కోరారు.
హోలీ పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హోలీ ఆడిన తర్వాత స్నానం కోసమని వెళ్లి ఐదుగురు మృతి చెందారు. కొమురంభీం జిల్లా కౌటాల మండలం వార్ధా నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతు కాగా వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టి.. నాలుగు మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. మృతులు నదిమాబాద్ కు చెందిన సంతోష్, ప్రవీణ్, కమలాకర్, సాయిగా గుర్తించారు. మృతదేహాలను కౌటాల ఆస్పత్రికి తరలించారు. యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కుప్పం నియోజకవర్గ మహిళలతో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళల ఆస్తిలో హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆర్థిక స్వాతంత్రాన్ని మహిళలకు కల్పించిన పార్టీ టీడీపీ అని అన్నారు. డ్వాక్రా సంఘాలు పెట్టింది టీడీపీనేనని తెలిపారు. మరోవైపు.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి కింద.. నెలకు 1500 వందల రూపాయలు అకౌంట్ వేస్తానని చంద్రబాబు చెప్పారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ పై 6 పరుగుల తేడాతో గుజరాత్ గెలుపొందింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హార్థిక్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో విజయం వరించింది. చివరలో మోహిత్ శర్మ కీలకమైన రెండు వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. ఉమేష్ యాదవ్ కూడా ముంబై కెప్టెన్ హార్థిక్…
పురాతన కాలంలో ప్రజలు భూమిలోపల గుహలు తయారు చేసుకుని ఆశ్రయం పొందేవారు. ఇప్పుడున్న రోజుల్లో అలాంటి గుహలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే బీహార్‌లో ఇలాంటి గుహలను అక్కడి జనాలు చూశారు. ఈ గుహలో వెతకగా ప్రజలు ఆశ్చర్యపోయారు. అందులో భారీగా మద్యం ఉండటాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ (45) పరుగులతో రాణించాడు. చివరలో రాహుల్ తెవాటియా (22) పరుగులు చేసి జట్టుకు ఫైటింగ్ స్కోరు అందించారు.