ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నియోజకవర్గంలోని పలు పెళ్లి వేడుకల్లో ఆదివారం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. జలదంకి మండలం జమ్మల పాలెంలో ఉన్నటువంటి ఎస్విఆర్ కళ్యాణ మండపంలో కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన బొల్లా హనుమంతరావు, కోటేశ్వరమ్మ దంపతుల కుమారుడు చరణ్, వినీల వివాహ మహోత్సవంలో కాకర్ల సురేష్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Read Also: Kesineni Nani: బెజవాడ పశ్చిమ సీటుపై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు..
అదేవిధంగా కలిగిరి మండలం వీర్నకల్లు గ్రామానికి చెందిన నలగర్ల అంజయ్య, సుజాత దంపతుల కుమారుడు సాయి, నాగగాయత్రి వివాహ వేడుకలకు హాజరైన కాకర్ల సురేష్.. వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పెళ్లి వేడుకలకు హాజరైన పలువురు నాయకులు, బంధుమిత్రులు కాకర్ల సురేష్ ను కలుసుకొని పరిచయం చేసుకున్నారు. కాకర్ల సురేష్ పెళ్లి వేడుకలకు హాజరవడంతో పెళ్లి పందిట్లో సందడి సందడిగా మారింది. కాకర్లతో పాటు వివాహ కార్యక్రమాలకు కలిగిరి మండల కన్వీనర్ బుజ్జం వెంకట కృష్ణారెడ్డి, ఇతర టీడీపీ ముఖ్య నేతలు, అభిమానులు బంధుమిత్రులు హాజరయ్యారు.
Read Also: Kangana Ranaut: కంగనాపై హిమాచల్ కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు