కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా.. యువతతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా యువత అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం అని చెప్పారు. ఏ రంగంలో కూడా అడ్డదారిలో విజయాలు రావు.. లక్ష్య సాధనకు అనునిత్యం కృషి చేయాలని పేర్కొన్నారు. ద్రవిడ విశ్యవిద్యాలయంలో తొలగించిన కోర్సులను పునరుద్దరిస్తాం.. కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. మద్యానికి బానిసలైన వారిని విముక్తి చేయడానికి మండలానికో సైకాలజిస్ట్ ను నియమిస్తామని చంద్రబాబు అన్నారు.
Kakarla Suresh: సమిష్టిగా కృషి చేద్దాం.. విజయం సాధిద్దాం..!
గంజాయికో, జె.బ్రాండ్ మద్యానికి అలవాటు పడకండా మీ బంగారు భవిష్యత్తుకు ప్రయత్నిస్తున్నా.. యువత మేలుకోవాలని చంద్రబాబు సూచించారు. మీ జీవితాలను చీకటిమయం చేసిన జలగన్నను ఇంటికి పంపాలని విమర్శించారు. ఏటా జాబ్ కేలండర్ విడుదల చేస్తానని మోసం చేశారు.. రాష్ట్రంలో గంజాయి సాగుకు అధికారమైందని దుయ్యబట్టారు. ప్రతి కిరాణ దుకాణంలో గంజాయి దొరికే స్థాయికి దిగజారిందని పేర్కొన్నారు. లక్షల మంది యువత కలను నిర్వీర్యం చేస్తూ గ్రూప్-1 ఉద్యోగాలు అమ్ముకొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తును అంధకారం చేసిన సర్వీస్ కమిషన్ ఉద్యోగులను శిక్షిస్తామని తెలిపారు.
CJI DY Chandrachud: ఆ ప్రణాళికతో ముందుకు సాగితే ఉన్నత స్థానానికి చేరవచ్చు..
ప్రపంచమంతా తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చాను.. కరవు నిలయమైన అనంతపురం జిల్లాలో కియా మోటార్ పరిశ్రమ ఏర్పాటు చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అనుబంధ పరిశ్రమలు పారిపోయాయి.. కియా మోటార్ ద్వారా ఉద్యోగాలు తాను ఇప్పిస్తే.. భూమి ద్వారా రూ. పదివేల కోట్ల అక్రమాలకు పాల్పడిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. 35 ఏళ్లుగా కుప్పం శాసనసభ్యుడిగా ఉన్నా.. ఈ ఐదేళ్ల కాలంలో కుప్పం ఖనిజ సంపదను దోచుకొనే యత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కేజీఎఫ్ మించి గనుల అక్రమ తవ్వకాలు చేస్తున్నారు.. అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో డ్రగ్ రహిత రాష్ట్రంగా మారుస్తానని చెప్పారు. యువత కసిగా ఓటేసి వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలని కోరారు.