మన అభివృద్ధి కొనసాగాలంటే జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని కోరారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. పేద వర్గాలను ఓట్ల కోసమే గత పాలకులు చూశారు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటు పడిన ఒకే ఒక్కడు జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. తాను 50 ఏళ్ల నుంచి ఎన్నో పోరాటాలు చేశానని.. అడగకుండానే పేద వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్న నేత జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తాము కూడా న్యాయం చేస్తామని కొన్ని రాజకీయ పార్టీలు ప్రగల్భాలు పలుకుతున్నాయని దుయ్యబట్టారు.
Viral Video : అరె ఎంట్రా ఇది.. గులాబ్ జామ్ తో ప్రయోగాలెంట్రా బాబు..
జగన్ మోహన్ రెడ్డితోనే మన అభివృద్ధి ప్రారంభమైందని కృష్ణయ్య పేర్కొన్నారు. ఏ మాత్రం పొరబాటు జరిగినా.. మన అభివృద్ధి పూర్తిగా ఆగిపోతుందని తెలిపారు. రాబోయే ఎన్నికల బరిలో 58 సీట్లు బీసీలకు ఇచ్చారని.. బీసీలకు ఇన్ని సీట్లు ఇవ్వాలంటే ధైర్యం కావాలన్నారు. ప్రతిపక్షాల ప్రలోభాలకు మన వర్గాలు తలొగ్గొద్దు.. రాష్ట్రంలో అనేకమంది సామాన్యులను అసెంబ్లీకి, పార్లమెంట్ కు జగన్ మోహన్ రెడ్డి పంపిస్తున్నారని చెప్పారు. తన లాంటి సామాన్యుడిని పార్లమెంట్ కు పంపిన ధైర్యవంతుడు జగన్ అని కొనియాడారు. విజయవాడ వెస్ట్ అభ్యర్ధిగా బీసీ వ్యక్తి షేక్ ఆసిఫ్ కు జగన్ మోహన్ రెడ్డి అవకాశమిచ్చారు.. విజయవాడ వెస్ట్ లో ఎంతటి బలవంతుడు దిగినా ఓడిస్తామని చెప్పారు. ఆసిఫ్ కు ఓటేసి సామాన్యుడిని గెలిపించుకోవాలని కోరుతున్నట్లు ఆర్. కృష్ణయ్య తెలిపారు.
Layoffs: 10 నిమిషాల వీడియో కాల్.. 400 మందికి పైగా ఉద్యోగులకు లేఆఫ్..