చరిత్ర సృష్టించేందుకు కేకేఆర్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ సునీల్ నరైన ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఈరోజు ఆర్సీబీతో జరిగే మ్యాచ్ లో ఆ ఫీట్ సాధించనున్నాడు. ఈ మ్యాచ్ తో టీ20ల్లో 500 మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా నిలువబోతున్నాడు. కాగా.. ప్రపంచ క్రికెట్ లో ఈ ఫీట్ ముగ్గురు మాత్రమే సాధించారు. కాగా.. ఈరోజు జరగబోయే మ్యాచ్ లో సునీల్ నరైన్ నాలుగోవాడు కానున్నాడు.
అమెరికాకు చెందిన ఓ మహిళ డెల్టా ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేశారు. లో దుస్తులు ధరించని కారణంగా తనను విమానం నుంచి దింపేస్తామన్నారని అన్నారు. ఇది వివక్షే.. కానీ మరొకటి కాదని మహిళ మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బాధిత మహిళ లిసా ఆర్చ్‌బోల్డ్ (38). బ్యాగీ జీన్స్, లూజ్ టీషర్ట్ తో లోపల బ్రా ధరించకుండానే విమానం ఎక్కారు. అయితే.. అది గమనించిన మహిళా సిబ్బంది ఆమెను తన ఎద బయటకు కనిపించనప్పటికీ కూడా.. కవర్ చేసుకోవాలని సూచించారు. డీజే అయిన ఆర్చ్‌బోల్డ్…
ముంబై ఇండియన్స్ జట్టుకు ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడా ఫ్యాన్సే ఆ జట్టును తిట్టిపారేస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీగా ఉన్నప్పటి జట్టులా అనిపించట్లేదు. కొత్త సారథి హార్థిక్ పాండ్యా జట్టులో చేరడంతో రెండు వర్గాలుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. అసలు ముంబై జట్టులో ఏం జరుగుతుంది..? వీళ్ల విభేదాలతో కనీసం ప్లే ఆఫ్ కు చేరేలా పరిస్థితి కనపడటం లేదు.
ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం సాధించింది. 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై SRH గెలుపొందింది. 277 పరుగులు చేసిన హైదరాబాద్.. ముంబై ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. 278 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. ఒకానొక క్రమంలో.. ఇంత భారీ లక్ష్యాన్ని ముంబై చేజ్ చేస్తుందా అనే సందేహం కలిగింది. ఈ మ్యాచ్ లో ప్రతీ ఒక్క బ్యాటర్…
ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరును నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్. ఇంతకుముందు ఆర్సీబీ (263) పరుగులు చేసింది. ఇప్పుడా రికార్డును సన్ రైజర్స్ బ్రేక్ చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఓపెనర్లు ట్రేవిస్ హెడ్ (62) పరుగులతో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. మయాంక్ అగర్వాల్ (11) పరుగులు చేసి ఔటయ్యాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్ (11) పరుగులు చేసి ఔట్ కాగా... మరో బ్యాటర్ ట్రేవిస్ హెడ్ కేవలం 24 బంతుల్లో 62 పరుగులు చేశారు.
క్రికెట్ దిగ్గజం.. సచిన్ టెండూల్కర్ కేరీర్ మలుపు తిరిగిన రోజు ఈరోజే (మార్చి 27, 1994). ముప్పేళ్ల క్రితం ఇదే రోజు క్రికెట్ దేవుడిగా అవతరించాడు. టీమిండియా న్యూజిలాండ్ తో మ్యాచ్ ఆడుతున్న సమయంలో.. ఇండియా రెగ్యూలర్ ఓపెనర్ నవజోత్ సింగ్ సిద్ధూ ఆ మ్యాచ్ కు దూరమయ్యాడు. అంతలో కెప్టెన్ అజారుద్దీన్.. ఓపెనింగ్ బ్యాటింగ్ చేయాలని సచిన్ టెండుల్కర్ కు చెప్పాడు. దీంతో.. ఆ పిలుపే సచిన్ కెరీర్ ను మలుపు తిప్పింది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పలమనేరు నుండి ప్రజా గళం పేరుతో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అందులో భాగంగా రేపు ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు పట్టణంలో ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, జిల్లా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరుతూ.. శంఖారావాన్ని పూరించి రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కంకణ బద్దుడై వస్తున్నారని, ఈ శంఖారావంతో వింజమూరు అదరాలి.. వైసీపీ బెదరాలి.. టీడీపీ గెలవాలని టీడీపీ…
హైదరాబాద్‌కు చెందిన స్టార్ హాస్పిటల్స్ బుధవారం హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న తన హాస్పిటల్ కాంప్లెక్స్‌లో అత్యాధునిక ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ సూట్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ లాంచ్ వేడుకలో హైదరాబాద్‌కు చెందిన సీనియర్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ ఆర్.విజయ్ కుమార్ మరియు హైదరాబాద్ స్టార్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్ మన్నం సూట్ లోగోను ఆవిష్కరించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ కు దిగనుంది. ఇప్పటికే ఇరుజట్లు తమ తొలి మ్యాచ్ లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలువాలన్న కసితో ఇరుజట్లు చూస్తున్నాయి.