ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో బిజీ అయ్యారు. రాష్ట్రంలో ఎన్నికలు శాంతి భద్రతల నడుమ నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా.. ఎన్నికల వేళ భారీగా డబ్బులు దొరుకుతుండటంతో తనిఖీలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే.. వివిధ పార్టీల నేతలతో ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా భేటీ అయ్యారు. పార్టీలు అనుసరించాల్సిన నిబంధనలపై చర్చించారు. ఎన్నికల కోడ్ అమలు, ఎన్నికల సాఫీ నిర్వహణపై పార్టీలతో ఏపీ సీఈఓ చర్చించారు. మీటింగ్ అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ మాట్లాడారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఉన్న అభ్యంతరాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అభ్యర్థి ఇంటింటి ప్రచారానికి అనుమతి తీసుకోవాలనడం సరైంది కాదని పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఇలాంటి నిబంధనలు లేవని తెలిపారు.
Read Also: R. Krishnaiah: అభివృద్ధి కొనసాగాలంటే జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలి..
తమ అభ్యంతరాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని బోండా ఉమ చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ లో కూడా ఈ నిబంధనలు లేవని అన్నారు. వైసీపీ నేతలు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. విజయవాడలో ఎమ్మెల్సీ రుహల్లా మసీదులో డబ్బులు పంచుతున్నారని తెలిపారు. మసీదులో, చర్చిలు, దేవాలయాల్లో ఇలా డబ్బులు పంచకూడదని ఎలక్షన్ కమిషన్ నిబంధన ఉందని చెప్పారు. ప్రతిపక్షాలకు అనేక నిబంధనలు పెడుతున్నారు.. కానీ అధికార పార్టీ నేతలు నిబంధనలు వర్తింప చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు, చీరలు, కుక్కర్లు పంచుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది..? అని ప్రశ్నించారు.
Read Also: Bengaluru Water Crisis: బెంగళూరు నీటి ఎద్దడి.. తగ్గించేందుకు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచనలు