ఇండియా- ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐదు టెస్టు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ జరుగనుంది. ఈ ఏడాది నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా(CA) బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25కు సంబంధించిన షెడ్యూల్ ఈరోజు విడుదల చేసింది. 1991-92 సీజన్ తర్వాత తొలిసారి ఈ సిరీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌గా మారింది. మొదటి టెస్ట్ పెర్త్ వేదికగానే జరుగనుంది. ఈ సిరీస్ ను పెర్త్ లో ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. మొదటి టెస్ట్ నవంబర్ 22-26 మధ్య జరుగనుంది.
Sujana Chowdary: అధిష్టానం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తా..
కాగా.. ఈ సిరీస్‌లో రెండో టెస్ట్ ఆడిలైడ్ ఓవల్ మైదానంలో జరుగనుంది. ఈ మ్యాచ్ డే అండ్ నైట్ ఉండనుంది. పింక్ బాల్‌తో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ టెస్టు డిసెంబర్ 6 నుంచి 10వ తేదీల్లో జరుగనుండగా.. మూడో టెస్టు గబ్బా స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 14-18 మధ్య ఉండనుంది. ఇక నాలుగో మ్యాచ్ (బాక్సింగ్ డే టెస్టు) ఆసీస్‌లోని అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్ మెల్‌బోర్న్‌లో డిసెంబర్ 26-30 తేదీల్లో జరుగుతుంది. ఇక చివరి ఐదో టెస్టు మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో 2025 జనవరి 3-7 తేదీల్లో జరగనుంది.
Pakistan: కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి.. ఆరుగురు చైనా పౌరుల మృతి
ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన గత నాలుగు టెస్ట్ సిరీస్‌లలో భారత్‌దే ఆధిపత్యం కొనసాగింది. ప్రస్తుత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఛాంపియన్‌గా ఉన్న టీమిండియా ప్రతిసారీ గెలుస్తూ మరింత ఆధిపత్యం ప్రదర్శించింది. కాగా.. ఐదో సిరీస్‌పై భారత్ కన్నేసింది. (భారత్ 2017, 2019, 2021, 2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను సొంతం చేసుకుంది). ఈ సిరీస్‌కు సంబంధించిన టికెట్లు జూన్ 4 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 షెడ్యూల్ ఇదే:
నవంబర్ 22-26- పెర్త్
డిసెంబర్ 6-10- అడిలైడ్ ఓవల్ (డే అండ్ నైట్, పింక్ బాల్ టెస్ట్)
డిసెంబర్ 14-18- గబ్బా
డిసెంబర్ 26-30- మెల్‌బోర్న్
2025 జనవరి 3-7- సిడ్నీ