టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో.. ఆయన పొన్నూరు నియోజకవర్గంలో రోడ్ షో, కార్నర్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ 1983లో ఒక బలమైన భావజాలంతో పుట్టిందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఆశయంతో పుట్టిందని చెప్పారు. అదే విధమైనటువంటి భావజాలంతో ఈరోజు పుట్టిన పార్టీ జనసేన అని అన్నారు. పవన్ కల్యాణ్ ఆశయం, తన ఆశయం ఒకటేనని చెప్పారు. పవన్ కల్యాన్ కు డబ్బు మీద ప్రేమ లేదు, కీర్తి కావాలని లేదన్నారు. కేవలం ప్రజలకు న్యాయం, మంచి జరగాలన్నదే తమ ఆశయం అన్నారు.
Election Campaign: ఏపీలో ప్రచారానికి కౌంట్డౌన్ మొదలు..
గుంటూరు ఎంపీగా ఐదు సంవత్సరాలు ఒక వ్యక్తిని చూశారు.. మరి అతనికి సీఎం జగన్ ఒక ప్రమోషన్ ఇచ్చారు.. అది దేన్ని చూసి ఇచ్చారో తెలియదని విమర్శించారు. ఇదిలా ఉంటే.. ఎంపీ నిధుల కింద సంవత్సరానికి రూ. 5 కోట్లు వస్తాయని.. అలా 5 సంవత్సరాలకు రూ. 25 కోట్లు వస్తాయని చెప్పారు. అందులో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడకుండా.. అవసరమైతే తాను సొంతంగా మరో రూ.25 కోట్లతో ప్రజలకు సేవ చేస్తానన్నారు. ప్రజల కష్టాన్ని, కన్నీళ్లను, చెమట చుక్కలను దోచుకోనని తెలిపారు. కాబట్టి ఈసారి తనను ఆశీర్వాదించాలని పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు.
Prashanthi Harathi: టాలీవుడ్ రీ ఎంట్రీకి రెడీ అయిన పెళ్ళాం ఊరెళితే నటి..
అదేవిధంగా.. ఈ ప్రాంతంలో ఈర్లపాటి రఘురామయ్య విగ్రహాన్ని చూశానని, అలాంటి వారి విగ్రహాలను పెట్టాలని పెమ్మసాని తెలిపారు. కేవలం రాజకీయ పార్టీ నాయకుల విగ్రహాలు కాకుండా.. ప్రతి వర్గాలలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల విగ్రహాలు పెడితే అందరు స్ఫూర్తి పొందుతారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మంచి మంచి వ్యక్తుల విగ్రహాలను పెడుతామని ఆయన చెప్పారు.