సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి సమిష్టిగా కలిసి పనిచేసి.. విజయం సాధిద్దామని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సురేష్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో కొండాపురం మండల కన్వీనర్ ఓంకారం అధ్యక్షతన మండలం క్లస్టర్ క్లస్టర్ ఇంచార్జ్ చెరుకూరి వెంకటాద్రి నేతృత్వంలో 5 మంది యూనిట్ ఇన్చార్జీలు 47మంది బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా.. అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఓటర్లకి దగ్గర కావాలన్నారు. కొత్త ఓటర్ల నమోదుకి ఎన్నికల సంఘం వచ్చే నెల 15 వరకు అవకాశం ఇచ్చిందని ఈ అవకాశాన్ని బూత్ కన్వీనర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జరగనున్న 48 రోజులు అత్యంత కీలకమని ఈ సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీ కార్యాలయం నుండి మేనేజర్ మరియు ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటామని ఎవరికి ఎలాంటి సందేహాలు, ఎదురైన తెలియపరచాలన్నారు. బూతు కన్వీనర్లు అందరికీ ఓటర్ల లిస్టుతో పాటు.. రెండు టీ షర్ట్ లు, రెండు టోపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకర్ల సురేష్ ప్రసార పాంప్లెట్లు, సూపర్ సిక్స్ క్యాలెండర్, తెలుగుదేశం పార్టీ సంచి ఇచ్చారు. విలువైన సమాచారం సేకరించేందుకు తగిన రిజిస్టర్ అందజేశారు. మండలంలోని జనసేన బీజేపీ నాయకులతో కలిసి బూతు కన్వీనర్ కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలన్నారు. తెలుగుదేశం గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని పిలుపునిచ్చారు.
CJI DY Chandrachud: ఆ ప్రణాళికతో ముందుకు సాగితే ఉన్నత స్థానానికి చేరవచ్చు..
ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. బూతు స్థాయి నాయకులే పార్టీకి వారధులు అని, ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేసి పార్టీని అధికారంలోనికి తీసుకురావాలన్నారు. విభేదాలను పక్కనపెట్టి సమన్వయంతో ముందుకు పోయి విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. పతి ఓటర్ ను కలుసుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. అధైర్య పడకండి అండగా ఉంటాను ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. 85 సంవత్సరాలు దాటిన వారికి బ్యాలెట్ ఓటింగ్ ఉంటుందని అది చాలా కీలకమన్నారు. క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలో మనకు కొన్ని విలువలు విధేయతలు ఉన్నాయని వాటిని కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా మాతో పంచుకోవాలని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే మనకు భవిష్యత్ అని తెలిపారు. బూతు స్థాయిలో మీ పనితీరును బట్టి ప్రాధాన్యత ఉంటుందన్నారు. కనుక ప్రతి ఒక్కరు కష్టపడి విజయానికి తోర్పాటును అందించాలని కోరారు.
నియోజకవర్గం క్లస్టర్ ఇంఛార్జుల అధ్యక్షుడు విశ్రాంతి, ఎంపీడీవో బ్రహ్మయ్య క్లస్టర్, యూనిట్ ఇంచార్జ్ మరియు బూత్ కన్వీనర్లకు దిశా నిర్దేశం చేశారు. కన్వీనర్లకు ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తెలియపరచాలన్నారు. నిర్లక్ష్యం చేయకుండా టెక్నాలజీని వాడుకొని ముందుకు పోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి యారం కృష్ణయ్య, మాజీ జడ్పీటీసీ సభ్యులు దామా మహేశ్వర రావు, మాజీ మండల కన్వీనర్లు బొట్లగుంట హరిబాబు, తలపనేని లక్ష్మీనారాయణ, మాజీ వైస్ ఎంపీపీ పోలినేని చంద్రబాబు నాయుడు, సీనియర్ నాయకులు బద్దిపూడి మాచర్ల, గద్దె రామకృష్ణ, వేముల పాటి మహేష్ కుమార్, దాసరి అశోక్, ఇతర టీడీపీ ముఖ్య నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జిలు, బూత్ కన్వీనర్లు, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Saudi Arabia: “మిస్ యూనివర్స్” ఈవెంట్‌లో తొలిసారి పాల్గొననున్న సౌదీ అరేబియా..