2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. భారత్-పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఫిబ్రవరి 23న (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. కాగా.. టీమిండియా మొదటి మ్యాచ్‌లో గెలిచి ఎంతో ఉత్సాహంతో ఉంది. తర్వాత మ్యాచ్‌లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు.. పాకిస్తాన్ జట్టు తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైంది. టీమిండియా, పాకిస్తాన్ జట్లు సూపర్ సండే మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతోంది. పాకిస్తాన్‌లోని కరాచీలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. దీంతో.. ఆఫ్ఘాన్ ముందు 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా విక్టరీతో మొదలు పెట్టింది. టోర్నమెంట్‌లోని రెండవ మ్యాచ్‌లో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. కాగా.. భారత్ తన రెండవ మ్యాచ్‌లో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులతో పాటు.. ఇతర దేశాల అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అక్షర్ పటేల్ హ్యాట్రిక్ సాధించినట్లయితే అతని పేరిట ఎన్నో రికార్డులు నమోదు అయ్యేవి. ఐసీసీ వన్డే టోర్నమెంట్‌లో అరంగేట్రంలోనే హ్యాట్రిక్ సాధించిన మొదటి స్పిన్నర్‌గా అక్షర్ నిలిచేవాడు. అంతేకాకుండా.. ఐసీసీ టోర్నమెంట్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత స్పిన్నర్‌గా రికార్డులకెక్కే వాడు. ఇప్పటివరకు ఐసీసీ ఈవెంట్‌లలో ఏ భారత స్పిన్నర్ హ్యాట్రిక్ సాధించలేదు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతేకాకుండా.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. అతను ఫీల్డింగ్ చేస్తుండగా గాయమైంది. దీంతో.. దుబాయ్‌లో భారత్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు అతను ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దూరమయ్యాడు. ఈ క్రమంలో.. ఫఖర్ స్థానంలో ఇమామ్-ఉల్-హక్‌ను జట్టులోకి తీసుకున్నారు.
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఎన్నో ముఖ్యమైన మ్యాచ్‌లు ఆడాడు. 2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్, 2011 ప్రపంచ కప్ సెమీఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ల్లో యువరాజ్ ముందుండి నమ్మకంగా ఆడాడు. అయితే.. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ గురించి ఆయన మాట్లాడుతూ, "ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ ఫైనల్ లాగా అనిపిస్తుందని తెలిపారు.
ఈ ఏడాది ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీని విడుదల చేసింది. ఈ సందర్భంగా.. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా అభిమానులకు, జట్టు సభ్యులకు ప్రత్యేకమైన భావోద్వేగ సందేశం ఇచ్చాడు. పాండ్యా, ఇతర ప్లేయర్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలతో కలిసి ఫ్రాంచైజీ గర్వించదగ్గ వారసత్వాన్ని నిలబెట్టుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. నేడు ఆఫ్ఘనిస్తాన్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. పాకిస్తాన్‌లోని కరాచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో గెలిచింది. 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది.
పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. బుధవారం కరాచీలో న్యూజిలాండ్‌తో జరిగిన టోర్నమెంట్-ఓపెనర్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్తాన్‌కు ఐసిసి జరిమానా విధించింది.