తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. పంటల రక్షణ కోసం కొత్త స్కీం తీసుకురానుంది. దీంతో పాటు.. రైతుల అవసరాలకు సంబంధించిన పరికరాలను అందించే యోచనలో సర్కార్ ఉన్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. అడవి జంతువులు, కోతుల నుండి పంటల రక్షణకు సోలార్ పెన్సింగ్ స్కీంను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అంతేకాకుండా.. పామాయిల్‌తో పాటు ఇతర పంటలకు డ్రిప్, తుంపర సేద్య పరికరాలను అవసరం మేరకు రైతులకు అందించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు.. రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా కూరగాయల సాగు పెంపునకు పెరి అర్బన్ క్లస్టర్లను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.
Read Also: Manchu Manoj: మంచు మనోజ్ కంటికి గాయం?
జూన్ మొదటి వారంలోపు రాష్ట్రంలో మరో ఆయిల్ పామ్ కర్మాగారం అందుబాటులోకి రానుందని.. మరో రెండు ఫ్యాక్టరీల నిర్మాణ పనులు ఆరంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. అలాగే.. మెకడమియా పంట సాగుకు అవసరమైన పరిస్థితులను.. అనువైన ప్రాంతాలను అధ్యయనం చేయాల్సిందిగా ఉద్యానశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రగతి చూపని ఆయిల్ పామ్ కంపెనీలపై చర్యలు ఆరంభించాలని.. ఇప్పటికే విశ్వతేజ ఆయిల్ పామ్ కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేసినట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
Read Also: Fact Check: రోహిత్ శర్మకు పాకిస్థాన్‌లో కూడా అంత క్రేజ్ ఉందా? ఈ వైరల్ వీడియోలో నిజమెంత?
ఇదిలా ఉంటే.. రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతు భరోసా నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. మొత్తం మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా నిధులు జమ చేశారు. మొదటగా ఒక ఎకరం ఉన్నవారికి, మరోసారి రెండు ఎకరాలు ఉన్నవారికి, ఈనెల 12న మూడు ఎకరాల ఉన్న రైతుల అకౌంట్లో రైతు భరోసా నిధులను జమ చేసింది.