JNTUH: జేఎన్‌టీయూహెచ్ వైస్ చాన్సలర్‌గా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ..
- జేఎన్‌టీయూ హైదరాబాద్ కు పూర్తి స్థాయి వీసీ
- వైస్ ఛాన్సలర్ గా టి. కిషన్ కుమార్ రెడ్డి నియామకం
- మూడేళ్ల పాటు వైస్ ఛాన్సలర్ గా కొనసాగనున్న కిషన్ రెడ్డి
- జేఎన్‌టీయూహెచ్ వైస్ చాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం జేఎన్‌టీయూహెచ్ (JNTUH) హైదరాబాద్ యూనివర్సిటీకి వీసీని నియమించింది. వైస్ చాన్సలర్‌గా టి. కిషన్ కుమార్ రెడ్డిని నియమించింది. వీసీ నియామకానికి సంబంధించిన ఫైల్ పై రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్‌టీయూ వీసీగా కిషన్ కుమార్ రెడ్డి.. పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా జేఎన్‌టీయూహెచ్ కొత్త వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ కె. విజయకుమార్ రెడ్డి (డైరెక్టర్), డాక్టర్ కె. వెంకటేశ్వరరావు (రిజిస్ట్రార్), వివిధ విభాగాల డైరెక్టర్లు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Also: Maha Kumbh 2025: వామ్మో.. కుంభమేళాలో ఇన్ని కోట్ల మంది స్నానాలు చేశారా? యూపీ సర్కార్ ప్రకటన
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. “విశ్వవిద్యాలయ అభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదలకు పాటుపడతాను. విద్యార్థుల అకడమిక్, పరిశోధనా ప్రగతికి అనువైన వాతావరణం అందించేందుకు కృషి చేస్తాను” అని తెలిపారు. ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి మెకానికల్ ఇంజనీరింగ్‌లో విశేష అనుభవం కలిగిన శాస్త్రవేత్త. ఆయన జేఎన్‌టీయూహెచ్‌లో డైరెక్టర్‌గా (1994-2016), పండిట్ దీన్‌దయాళ్ పెట్రోలియం యూనివర్శిటీ (PDPU) వైస్ చాన్సలర్‌గా (2016-2018) సేవలందించారు. అలాగే AICTE, DRDL, DMRL, NASA వంటి సంస్థలతో పరిశోధనలలో కీలక పాత్ర పోషించారు. ఆయనకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (2010), IAAM మెడల్ (2018) వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి.
Read Also: The Devil’s Chair: సంతోషపడాలా? బాధపడాలా? అదిరే అభి ఆసక్తికర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!