మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర కూడా ఉంది.. వందల మంది ప్రాణాల త్యాగం లేదా..? అని ప్రశ్నించారు. రాజకీయంగా దెబ్బతింటాం అని తెలిసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.. తెలంగాణ ఏర్పాటులో ఎవరి పాత్ర వాళ్లకు ఉందని అన్నారు. కేసీఆర్ మళ్ళీ రావాలని కొందరు కోరుకుంటున్నారు.. 10 ఏళ్ల తర్వాత కూడా నిరుద్యోగ సమస్య ఎందుకు ఉందని దుయ్యబట్టారు. ధనిక రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పు ఎలా అయ్యింది..? నెలకు రూ.6500 కోట్లు ఈఎంఐలు కడుతున్నామని తెలిపారు. ఇదేనా గొప్ప పాలన.. కేసీఆర్ మళ్ళీ వస్తే.. రూ.20 వేల కోట్ల అప్పులు చేసి పెడతారని విమర్శించారు.
Read Also: Council Chairman: కేటీఆర్ రైతు దీక్షపై గుత్తా సుఖేందర్ కౌంటర్..
కేసీఆర్ శాసన సభకి రావడం లేదు.. కన్న తల్లితండ్రులను చంపి.. జడ్జి ముందు తల్లితండ్రులు లేని అనాధని అన్నట్టు కేటీఆర్ మాట్లాడుతున్నాడని మంత్రి జూపల్లి విమర్శించారు. కేటీఆర్‌కి సిగ్గుండాలి.. సర్పంచుల బిల్లులు ఇవ్వట్లేదు అని అనడానికి సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. బకాయి పెట్టింది ఎవరు..? మీరు చేసిన అప్పులు కట్టడానికి.. అప్పు తేవాల్సి వస్తుందని అన్నారు. ప్రజలు తెలివైన వాళ్ళు.. అమాయకులు కాదని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
Read Also: Realme: పిచ్చెక్కించే ఫీచర్లతో మార్కెట్ లోకి రియల్‌మి P3 సిరీస్ విడుదల.. ధర ఎంతంటే?
కృష్ణా వాటర్ గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కి లేదని మంత్రి ఆరోపించారు. 511 టీఎంసీ ఏ లెక్క ప్రకారం ఆంధ్రాకు ఇచ్చారు.. ఆంధ్రాకు 511 టీఎంసీలు ఇచ్చి.. వాళ్లకు న్యాయబద్ధత కల్పించారని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే దానిపై పోరాటం చేస్తే కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చిందని తెలిపారు. కేసీఆర్ హయంలో నాలుగు స్తంభాల ఆట నడిచింది.. కుటుంబ పాలనే అని ఆరోపించారు. మీటింగులకు కేసీఆర్ వచ్చే వరకు మైక్ పట్టుకునే ధైర్యం కూడా చేయలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఆర్పుకోవడమే కాకుండా.. ఢిల్లీలో కూడా ఆర్పేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.