శాసన మండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. కేటీఆర్ రైతు దీక్షపై కౌంటర్ ఎటాక్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతు దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. కరెంట్ కట్ అయినా.. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన రైతులే రోడ్డెక్కుతారు.. రాజకీయ పార్టీలు చెబితే రైతులు ధర్నాలు చేయరని దుయ్యబట్టారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వం 100 శాతం కులగణన సర్వే పర్ఫెక్ట్ చేసిందని తెలిపారు. అసలు కులగణన మీద బీసీల జనాభాపై లెక్క ఎక్కడ ఉంది.. దేశంలోనే ఇదే మొదటిసారి కదా బీసీ కులగణ చేసిందని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఆఫిషియల్ రికార్డు లేదు.. బీసీ కులగణన సర్వే సరైనదని తెలిపారు.
Read Also: Satyendra Jain: ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రిపై విచారణకు రాష్ట్రపతి అనుమతి
నాయకుడికి కులం, మతంతో సంబంధం ఉండదు.. ప్రజలతో మమేకమైన వాడే నాయకుడు అవుతాడని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మరోవైపు.. బీజేపీ బీసీ కులగణకు వ్యతిరేకమని అందరికి తెలిసిందే.. వ్యవస్థలపై గౌరవం తగ్గుతున్న మాట వాస్తవమే.. రాజకీయం, ప్రభుత్వ సంస్థలు ఇతర వ్యవస్థలపై సైతం నమ్మకం తగ్గుతుందని ఆయన ఆరోపించారు. కాగా.. ఉచితలపై ఒక కఠినమైన చట్టం రావాల్సిందేనని అన్నారు. కేసీఆర్ త్యాగాలు చేసింది నిజమే.. తెలంగాణ ఉద్యమం నడిపించింది వాస్తవమే.. కానీ 4 కోట్ల ప్రజలు హీరో అంటే.. మరి ఎన్నికల్లో 4 కోట్ల ప్రజలు ఓట్లు వేయలేదు కదా…! అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నువ్వు నేను కోరుకుంటే ఎన్నికలు రావు.. ప్రభుత్వం పడిపోతుంది అంటే అది అధికారం కోల్పోయిన బాధలో మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటారు.. ఈ ప్రభుత్వ పాలన పర్వాలేదని గుత్తా తెలిపారు.
Read Also: Hyderabad: నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు..
జమిలి ఎన్నికలపై గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కలిసి వస్తే పార్టీలపై, ప్రభుత్వంపై, అభ్యర్థులపై భారం తగ్గుతుందని అన్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీకి ఎన్నిక జరుగుతుందని చెప్పారు. ఉన్న ఓటర్లే తక్కువ.. ఎన్నికల కోడ్, ప్రభుత్వ పరిపాలనపై ప్రభావం చూపిస్తోందని తెలిపారు. కోడ్ ప్రభావం చూపకుండా చర్యలు తీసుకోవాలని ఈసీకి లేఖ రాశానని చెప్పారు.