ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ సభ్యులు కలిశారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను ప్రోత్సహించడానికి కావాల్సిన బడ్జెట్‌ను తయారు చేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేశారు. తెలంగాణ విద్యా కమిషన్ విద్యా రంగంలోని వివిధ వర్గాలతో వరుస చర్చలు జరిపి వారి నుండి అనేకమైన సలహాలు సూచనలు తీసుకున్నట్లు విద్యా కమిషన్ తెలిపింది. గత ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం విద్యా రంగాన్ని అస్తవ్యస్తం చేసిందని.. దీని ఫలితంగా అభ్యాస పేదరికం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా రంగం దుస్థితి వలన ప్రజా, పౌర సమాజ సంస్థల నుండి ఒత్తిడి, అశాంతి పెరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు.
Read Also: Kiss: ముద్దంటే పడని అబ్బాయి ఉంటాడా అసలు?
2025-26 సంవత్సరములో విద్యారంగానికి బడ్జెట్‌ను పెంచాలని.. ప్రభుత్వం తగిన జోక్యం చేసుకోవాలని విద్యా కమిషన్ ఛైర్మన్ సభ్యులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో రాష్ట్ర బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును రూపొందించగల అభివృద్ధి ప్రాధాన్యతలకు దిశానిర్దేశం చేయడం కోసం ఈ బడ్జెట్ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉందని పేర్కొన్నారు.
Read Also: JNTUH: జేఎన్‌టీయూహెచ్ వైస్ చాన్సలర్‌గా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ..
ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ఉత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్ది.. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను ప్రోత్సహించడానికి కావాల్సిన బడ్జెట్ ను తయారుచేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విద్య కమిషన్ ఛైర్మన్ సభ్యులు అందజేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ ఫౌండేషనల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అప్ గ్రేడ్ చేసి.. అంతర్జాతీయ ప్రమాణాలు, ఉత్తమ అభ్యాస వాతావరణం, ఉత్తమ బోధనా వాతావరణంతో కూడిన ఉత్తమ పాఠశాల ప్రమాణాలు కలిగి ఉండేటట్లుగా బడ్జెట్ తయారుచేసి ప్రభుత్వానికి అందించారు.