ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విశాఖలో సముద్రంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. నిన్న సాయంత్రం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. వైజాగ్ హార్బర్ నుంచి V1-MO -2736 నెంబర్ గల బోట్ లో వేటకు వెళ్లినట్లు తెలుస్తోంది. హార్బర్ నుంచి దక్షిణ దిశగా గంగవరం వైపు వేటకు వెళ్లారు మత్య్సకారులు. అయితే వారి ఆచూకీ తెలియకపోవడంతో ఫిషింగ్ బోట్లు, కోస్ట్ గార్డ్ సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Read Also: Atishi: లోక్‌సభ ఎన్నికల ముందు మరో నలుగురు ఆప్ నేతల అరెస్ట్..
మరోవైపు.. వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సముద్రం వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే.. గల్లంతైన మత్స్యకారులు ఎవరన్నది తెలియకపోవడంతో.. వేటకు వెళ్లిన కుటుంబాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
Read Also: Janhvi Kapoor: జాన్వీ కపూర్ మామూలుది కాదుగా.. ఏకంగా ఎక్స్ సీఎం మనవడితో పెళ్లి?