ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 125 పరుగుల లక్ష్యాన్ని మరో 27 బంతులు ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. ఈ విజయంతో రాజస్థాన్ వరుసగా మూడు మ్యాచ్ లు ఆడి.. మూడింటిలో గెలిచింది. ఇక.. ముంబై కూడా వరుసగా మూడింటిలో మూడు ఓడిపోయింది. హోంగ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ ల్లోనూ ముంబై విజయం సాధించలేకపోయింది. ముంబై బ్యాటర్లు ఘోర విఫలం కావడంతో ఓటమిపాలైంది.
Siddaramaiah: ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్య కొత్త పల్లవి!
రాజస్థాన్ బ్యాటర్లలో యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ (54) పరుగులతో అజేయంగా నిలిచాడు. తన జట్టుకు విజయాన్ని అందించాడు. మొదటగా ఓపెనర్లుగా బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్ (10), జోష్ బట్లర్ (13) శుభారంభాన్ని అందించలేకపోయారు. ఆ తర్వాత సంజూ శాంసన్ (12) పరుగులు చేసి ఔటయ్యాడు. రియాన్ పరాగ్ (54) పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ (16), శుభం దూబె (8) పరుగులు చేశారు. ముంబై బౌలింగ్ లో ఆకాశ్ మద్వాల్ 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత మఫాకా ఒక వికెట్ సాధించాడు.
IPL 2024: గ్రౌండ్లోకి వెళ్లి రోహిత్ శర్మను భయపెట్టిన అభిమాని.. వీడియో వైరల్
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ముంబై బ్యాటింగ్ లో ఓపెనర్లు ఇషాన్ కిషన్ (16) పరుగులు చేయగా.. రోహిత్ శర్మ, నమన్ ధీర్, బ్రేవీస్ గోల్డెన్ డక్ పెట్టారు. ఆ తర్వాత తిలక్ వర్మ (32), హార్ధిక్ పాండ్యా (34) పరుగులతో రాణించారు. పీయూష్ చావ్లా (3), టిమ్ డేవిడ్ (17), కోయెట్జీ (4), బుమ్రా (8), ఆకాశ్ మద్వాల్ (4) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలింగ్ లో ట్రెంట్ బౌల్ట్, యజువేందర్ చాహల్ తలో 3 వికెట్లు తీశారు. నాంద్రే బర్గర్ 2, ఆవేశ్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.