అయోధ్యలో రామజన్మోత్సవం శోభ సంతరించుకుంది. 500 ఏళ్ల తర్వాత రామమందిరంలో రాంలల్లా జయంతి వేడుకలు జరగబోతున్నాయి. అందువల్ల ఈసారి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. మంగళవారం నుంచి అయోధ్య రామ నవమి ఆనందోత్సాహాలలో మునిగిపోనుంది. రామ్‌నగరిలోని ఎనిమిది వేల మఠాలు, దేవాలయాలలో అభినందన పాటలు మరియు వివిధ ఆచారాలు ప్రారంభంకానున్నాయి. రామాలయం సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారనుంది. రామ్ జన్మోత్సవ్ శుభ సమయంలో.. రామ్ లల్లా చైత్ర ప్రతిపాద నుండి రామ నవమి వరకు ఖాదీతో చేసిన ప్రత్యేక దుస్తులను ధరించనున్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. చెన్నై ముందు 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో కోల్కతా బ్యాటర్లు చేతులెత్తేశారు.
పాకిస్థాన్ ప్రధానమంత్రిగా కొత్తగా ఎన్నికైన షాబాజ్ షరీఫ్.. తన మొదటి విదేశీ పర్యటనకు వెళ్లారు. నవాజ్, ఇమ్రాన్‌ల బాటలోనే తొలి విదేశీ పర్యటనకు సౌదీ అరేబియాను ఎంచుకున్నాడు. అయితే.. కశ్మీర్ సమస్యకు సంబంధించి సౌదీ అరేబియా షాబాజ్‌కి భారీ షాకిచ్చింది. కశ్మీర్ అంశం భారత్, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సమస్య అని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. న్యూఢిల్లీతో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ పాకిస్థాన్ ప్రధానికి సూచించారు.
మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ మధ్యాహ్నం 2.30 గంటలకు కేసును విచారించనున్నారు. ఏప్రిల్ 3న ఈడీ.. కేజ్రీవాల్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసులో తన నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్- కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. ముందుగా టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. హోంగ్రౌండ్లో జరిగే ఈ మ్యాచ్లో విజయం సాధించాలని సీఎస్కే భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్కతా.. మరో విజయంపై కన్నేసింది.
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వైస్ కెప్టెన్గా హార్ధిక్ పాండ్యా ఉన్నారు. ఒకవేళ ఫ్యూచర్లో అవకాశాలు వస్తే.. సీనియార్టీ ప్రకారం బుమ్రా, హార్దిక్ పాండ్యా, రాహుల్ లాంటి వారు ఉన్నారు. వారినీ కాదని.. టీమిండియా స్టార్ ప్లేయర్కు ఫ్యూచర్ కెప్టెన్ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఓటేశారు.
ఉత్తరఖండ్లోని రాంనగర్ సమీపంలోప ఉండే గర్జియా మాత ఆలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో దుకాణాలు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఆలయం కోసి నది ఒడ్డున ఉంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల మహిళల ఖాతాల్లోకి ఏటా లక్ష రూపాయలను జమ చేస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు.
గత 50 సంవత్సరాలుగా టెక్స్టైల్, జ్యూవెలరీ రంగాలలో ఎంతో ప్రావీణ్యం పొందిన అనుటెక్స్ మల్కాజిగిరి వారు ఇప్పుడు ప్రప్రథమంగా ప్రగతి నగర్, కూకట్ పల్లి నందు " అను జ్యూవెలర్స్ " Exclusive జ్యూవెలరీ షోరూంను ప్రారంభించటం జరిగింది.
క్రికెట్ ఆస్ట్రేలియా 2024-25 సీజన్ కోసం మహిళల క్రికెట్ జట్టు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ప్రకటించింది. సోఫీ మోలినెక్స్ (Sophie Molineux) రెండు సంవత్సరాల తర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్‌కి తిరిగి వచ్చింది. గత కొన్ని సిరీస్‌లలో మోలినెక్స్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్ పర్యటనలో కూడా, ఈ స్టార్ ఆల్ రౌండర్ అద్భుతమైన ఆట ఆడి ప్రశంసలు అందుకుంది.