ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఓ హత్య కేసులో నిందితుడు.. 26 ఏళ్లుగా వెతుకుతున్న 50 ఏళ్ల మిత్లేషియా ఉత్తమ్ పటేల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 1999లో రాజ్‌కోట్‌లోని జెట్‌పూర్‌లోని టైల్స్ ఫ్యాక్టరీలో ఓ వాచ్‌మెన్ ను హత్య చేశాడు. ఈ కేసులో మిత్లేషియా పటేల్‌ను నిందితుడిగా చేర్చారు. కాగా.. ఈ ఘటనపై క్రైమ్ ప్రివెన్షన్ బ్రాంచ్ విచారణ చేపట్టింది.
విల్లు, బాణం ఆకారంలో 'గ్లాస్ బ్రిడ్జ్' ఇండియాలోని ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ వంతెనను చిత్రకూట్‌లోని తులసి (షబ్రి) జలపాతం వద్ద నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. కోదండ అడవుల్లో ఉన్న జలపాతంపై రూ.3.70 కోట్లతో శ్రీరాముడి విల్లు, బాణం ఆకారంలో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. అయితే.. ఈ వంతెనను లోక్‌సభ ఎన్నికల తర్వాత పర్యాటకుల కోసం ప్రారంభించనున్నారు. రానున్న కాలంలో ఇది అత్యంత అందమైన ఎకో టూరిజం కేంద్రంగా మారనుంది. మరోవైపు.. పర్యాటకుల కోసం గ్లాస్ బ్రిడ్జ్ సమీపంలో పార్క్, హెర్బల్…
భారతదేశంలో క్రికెట్‌ను ఒక మతంగా పరిగణిస్తారు. అంతేకాకుండా.. క్రికెట్ అభిమానులు తమ అభిమాన క్రికెటర్లను 'దేవుడు'తో పోలుస్తారు. కాగా.. అలాంటి దృశ్యం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక నిన్నటి మ్యాచ్‌లో టాస్ సమయంలో సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ మాట్లాడుతుండగా ఓ అభిమాని అతడికి హారతి ఇచ్చాడు. ఈ వీడియోకు బాహుబలిలోని 'దండాలయ్యా' అనే పాటను యాడ్ చేసి 'ఎక్స్' లో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఈ వీడియోపై స్పందించిన కమిన్స్ 'థ్యాంక్యూ' అంటూ…
కష్టాలు చుట్టుముట్టిన అరవింద్ కేజ్రీవాల్‌కు ఒకదాని తర్వాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలో.. అరవింద్ కేజ్రీవాల్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ బుధవారం తన పదవితో పాటు, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమంగళం సమీపంలోని శివరకోట్టై వద్ద విరుదునగర్-మదురై హైవేపై ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదంలో వేగంగా వస్తున్న కారు.. బైకును తప్పించబోయి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు, బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో రహదారి మొత్తం రక్తసిక్తమైంది.
మద్యం కుంభకోణంలో తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ ప్రజలకు చేరవేస్తున్నారు. ఈ క్రమంలో.. మంగళవారం కేజ్రీవాల్ భార్య సునీత తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. కేజ్రీవాల్ తన భార్య ద్వారా మరోసారి సందేశం పంపారు. ముఖ్యమంత్రి రెండు సందేశాలపై మంత్రి గోపాల్ రాయ్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్ మాకు రెండు సందేశాలు అందించారని ఆప్ నేత పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేశారన్నది కోర్టు ముందు కేజ్రీవాల్ వాదన వినిపించారు. అనంతరం.. కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో.. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
లోక్సభ ఎన్నికలకు రెండో దశ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో.. తమిళనాడులోని కడలూరు లోక్‌సభ నియోజకవర్గం ప్రజల భవిష్యత్తును అంచనా వేస్తున్న చిలుక యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఎన్నికల ప్రచారంలో ఉన్న.. కడలూరు పీఎంకే అభ్యర్థి తంగర్ బచ్చన్ ఓ చెట్టు కిందకు వచ్చి సేదతీరుతుండగా, చిలుక జోస్యుడు కనపడ్డాడు. దీంతో తనకు జోస్యం చెప్పమని అడిగారు. ఆ చిలుక జోస్యుడు బోనులో ఉన్న చిలుకను బయటకు రప్పించి…
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో చెన్నై గెలుపొందింది. 17.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. చెన్నై బ్యాటింగ్ లో రుతురాజ్ గైక్వాడ్ (67), శివం దూబె (28), డారిల్ మిచెల్ (25), రచిన్ రవీంద్ర (15) పరుగులు చేశారు. చివరలో ధోనీ వచ్చి అభిమానులకు సంతోషం అందించారు. చెన్నై గెలుపుతో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. మరోవైపు.. కేకేఆర్ బౌలింగ్ లో…
రాజస్థాన్ లోని కోటాలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ఘటన కలకలం రేపుతుంది. మహారావ్ భీమ్ సింగ్ ఆసుపత్రిలో పని చేసే 32 ఏళ్ల కాంట్రాక్టు ఉద్యోగి మృతదేహం వైద్య సదుపాయంలోని టాయిలెట్‌లో అనుమానాస్పద స్థితిలో కనిపించింది. కాగా.. ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని నయాపురా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వ్యక్తి మృతికి గల కారణాలు తేలుస్తాయని చెప్పారు. ఈ ఘటన…