ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల సీట్ల వ్యవహారాలు సద్దుమణుగడం లేదు. పార్టీలో సముచిత స్థానం లభించలేదని కొందరు.. రాజీనామాలు చేస్తు్న్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రాజకీయ పార్టీలు కొన్ని చోట్ల సిట్టింగ్ అభ్యర్థులను మార్చి వేరే అభ్యర్థులను నియమిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. తాజాగా.. ఉండిలో టీడీపీ శ్రేణులు రగులుతున్నారు.
పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్ ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించటంతో వైసీపీ ఫేక్ పరిశ్రమను తెర పైకి తెచ్చిందని ఆరోపించారు. వైసీపీ ఫేక్ పరిశ్రమలో తప్పుడు వీడియోలు సృష్టిస్తూ.. ప్రజల్ని గందరగోళం సృష్టించాలని చూస్తోందని తెలిపారు. వైసీపీ ఫేక్ ప్రచారాలను ధీటుగా తిప్పికొట్టాలని చంద్రబాబు తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించారు. ఫేక్ ప్రచారానికి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోను సైతం వదలట్లేదని ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. పల్నాడు జిల్లాలో 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అంబటి తెలిపారు. ప్రతి పేదవాడి గుండెను తట్టి చూసినా ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని అంటున్నారని చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే సీఎంగా జగన్ పనిచేశారని కొనియాడారు. ప్రతిపక్ష నాయకులు చెబుతున్న మాటలు ప్రజలు నమ్మరు... నిన్నటిదాకా వాలంటీర్ల వ్యవస్థను ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్క రోజులో నాలుక మడతేశారని ఆరోపించారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మె్ల్యే అభ్యర్థి సుజనా చౌదరి సమక్షంలో వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ కనకదుర్గ టెంపుల్ చైర్మన్ పైలా సోమి నాయుడు ఈరోజు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. సొంత జిల్లా నుంచి పోటీ చేయడం అదృష్టంగా భావిస్తానని తెలిపారు. దేశ రాష్ట్ర రాజకీయాలను చూశా... ప్రపంచం మొత్తం తిరిగానన్నారు. కృష్ణా జిల్లా నా పుట్టినిల్లు.. విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా బరిలో దిగడాన్ని భగవంతుడి వరంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇక్కడ ప్రజలకు సేవలందించేందుకే భగవంతుడు పంపాడనుకుంటున్నానని…
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఉత్కంఠభరిత విజయం సాధిచింది. ఈ మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపొందింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్.. ఆఖరి బంతికి టార్గెట్ ను చేధించింది. చివరలో రషీద్ ఖాన్ (24), రాహుల్ తెవాటియా (22) రాణించడంతో విక్టరీ సాధించింది.
ఉత్తర ప్రదేశ్ లోని ఘజియా బాద్ లో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించింది. తర్వాత ఏమీ ఎరుగనట్లు అనుమానం రాకుండా సదరు మహిళ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టింది. కాగా.. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. అసలు విషయాలను బయటకు రాబట్టారు.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. గుజరాత్ ముందు 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. రాజస్థాన్ బ్యాటర్లలో రియాన్ పరాగ్ (76), సంజూ శాంసన్ (68) చెలరేగి ఆడటంతో.. రాజస్థాన్ భారీ స్కోరు చేసింది.
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి కోసం కన్న కొడుకు, కూతురును కడతేర్చింది ఓ తల్లి. ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు పిల్లలు అడ్డుకుంటున్నారని.. ఈ క్రమంలో 5 ఏళ్ల బాలిక, 3 ఏళ్ల బాలుడును కొట్టి చంపింది. ఈ ఘటన రాయ్‌గఢ్ జిల్లాలో జరిగింది. కాగా.. ఈ ఘటనపై నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడితో పెళ్లి చేసుకుందామని, పిల్లలు అడ్డుకుంటున్నారని యువతి పోలీసులకు తెలిపింది. ఈ మేరకు బుధవారం పోలీసులు సమాచారం అందించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ‘ముస్లిం లీగ్ ముద్ర’ ఉందని బీజేపీ పదే పదే ఆరోపణలు గుప్పిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అధికార (బీజేపీ)పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ వేదికలపై పదే పదే అబద్ధాలు చెప్పడం వల్ల చరిత్ర మారదని తెలుసుకోవాలని రాహుల్ అన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ.. పంజాబ్ లో మరో 4 స్థానాలను పెండింగ్ లో ఉంచారు. ఆ నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటనపై సీఎం భగవంత్ మాన్ ఎప్పుడు ప్రకటిస్తారో చెప్పారు. జలంధర్, లూథియానా స్థానాలకు అభ్యర్థులను ఈ రోజున ప్రకటిస్తుందని సీఎం భగవంత్ మాన్ 'X' లో సమాచారం ఇచ్చారు.