ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ 153 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఓ మోస్తారు స్కోరును సాధించింది. ఢిల్లీ భారీ స్కోరు చేయకుండ ఉండేందుకు కేకేఆర్ బౌలర్లు శ్రమించడంతో పరుగులను కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటింగ్ లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అత్యధికంగా (35*) పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ (27) పరుగులు సాధించాడు.
Read Also: AP Elections 2024: ఎన్నికల తనిఖీల్లో రూ. 119 కోట్ల విలువైన అక్రమ మద్యం, డ్రగ్స్ స్వాధీనం
మొదటగా ఓపెనర్లుగా బరిలోకి దిగిన పృధ్వీ షా (13), జేక్ ఫ్రేసర్ (12) పరుగులు చేసి నిరాశపరిచారు. ఆ తర్వాత అభిషేక్ పోరెల్ (18) పరుగులు చేశాడు. హోప్ (6), అక్షర్ పటేల్ (15), ట్రిస్టన్ స్టబ్స్ (4), కుమార్ కుషాగ్రా (1), రషీక్ సలాం (8) పరుగులు చేశారు. కేకేఆర్ బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో చెలరేగాడు. కీలకమైన వికెట్లు తీసి పరుగులు చేయకుండా ఆపాడు. ఆ తర్వాత.. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్ కు తలో వికెట్ దక్కింది.
Read Also: Pakistan: చైనీస్ ఇంజనీర్ల హత్య కేసులో ప్రధాన చర్యలు.. నలుగురు అనుమానితుల అరెస్ట్