గత నెలలో పాకిస్థాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో చైనీస్ ఇంజనీర్లు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా.. మార్చి 26న జరిగిన దాడిలో ఐదుగురు చైనా ఇంజనీర్లు, ఒక పాకిస్థానీ డ్రైవర్ మరణించారు. వీరంతా ఇస్లామాబాద్ నుంచి దాసు జలవిద్యుత్ ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్తుండగా.. ఖైబర్ పఖ్తుంక్వా ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది.
Lalu Prasad Yadav: రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని బీజేపీ చూస్తోంది.. లాలూ..
మరోవైపు.. ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించలేదు. అయితే ఇందులో తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ప్రమేయం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో.. నలుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ఉగ్రవాద నిరోధక విభాగం తెలిపింది.
India-Canada Row: ఖలిస్తాన్ నినాదాలు.. కెనడా రాయబారికి భారత్ సమన్లు..
కాగా.. ఉగ్రదాడికి సంబంధించి నెట్‌వర్క్ మొత్తం పట్టుకోవడమే తమ ప్రయత్నమని అధికారులు చెబుతున్నారు. అరెస్టయిన వారిలో ఆదిల్ షాబాజ్, మహ్మద్ షఫీక్ ఖురేషీ, జాహిద్ ఖురేషి, నజీర్ హుస్సేన్‌లుగా గుర్తించారు. దాడి చేయడంలో ఆదిల్ షాబాజ్ కీలక పాత్ర పోషించాడని ఆ శాఖకు సంబంధించిన అధికారి ఒకరు తెలిపారు.