JanaNayagan : జననాయగన్.. తెలుగు రైట్స్ నాగవంశీ నుండి.. దిల్ రాజు చేతికి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘జననాయకన్ ’. హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాను జననాయకుడుగా తీసుకువస్తున్నారు.తమిళంతో పాటు తెలుగు వెర్షన్‌లో సంక్రాంతి కానుకగా జనవరి 9న ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ రూ. 9 కోట్లకు కొనుగోలు చేశారని గతంలో వార్తలు వచ్చాయి. విజయ్ నటించిన లియో సినిమాను కూడా అప్పట్లో నాగవంశీ కొనుగోలు చేసి రిలీజ్ చేశాడు. ఇప్పుడు జననాయకుడు హక్కులు కూడా నాగవంశీ చేతికి వెళ్లడంతోభారీ రిలీజ్ ఉంటుందని అనుకున్నారు.
అయితే తాజా అప్‌డేట్ ప్రకారం, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ తెలుగు రాష్ట్రాల్లో ‘జననాయకన్’ డిస్ట్రిబ్యూషన్ నుండి తప్పుకున్నారు. సంక్రాంతి ఇతర హీరోల భారీ చిత్రాలు రిలీజ్ ఉండడమో మరే ఇతర కారణాల ఏమోకానీ నాగవంశీ జననాయకుడు రైట్స్ డీల్ క్యాన్సిల్ చేశాడు. ఈ నేపథ్యంలో జననాయకుడు తెలుగు రైట్స్ కోసం టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగారు. తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన నైజాంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాల థియేట్రికల్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఆయన సంస్థ svc ద్వారా ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో రిలీజ్ కాబోతుంది. విజయ్ కెరీర్‌లోనే కీలక చిత్రంగా భావిస్తున్న ‘జననాయకన్’ తెలుగు మార్కెట్‌లో ఎంతటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. దిల్ రాజు వంటి అనుభవజ్ఞుడైన నిర్మాత డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకోవడం సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!