ఈసీ కారణాలపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బటన్ నొక్కిన తర్వాత ఖాతాల్లో జమచేయలేదని ఈసీ ఆర్డర్ లో పేర్కొంది. స్కీంలు ప్రారంభించి నగదు బదిలీ చాలావరకు జరిగిన వాటిని కూడా అడ్డుకున్నారనీ అంటున్న వైసీపీ ఆరోపించింది. ఈ క్రమంలో వివరాలు కూడా వెల్లడించింది అధికార వైసీపీ. జనవరి 29న మొదలైన ఆసరా చివది దఫా నగదు బదిలీ అయినట్లు తెలిపింది. రూ. 6,394 కోట్లకు గానూ, రూ. 4, 555 కోట్ల బదిలీ అయిందని.. రూ. 1,839 కోట్ల మాత్రమే నగదు…
దక్షిణ కాశ్మీర్‌లోని హతివారా పుల్వామాలోని జీలం నదిలో బుధవారం పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది నీటిలో పడిపోయారు. కాగా.. అందులో ఏడుగురిని రక్షించారు, మరో ఇద్దరు గల్లంతు అయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. SDRF రెస్క్యూ సిబ్బంది వారి సామగ్రితో తప్పిపోయిన వ్యక్తుల కోసం రంగంలోకి దిగారు. నదిలో ఇసుక తీసేందుకు వెళ్లి బోటు ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు. పడవలో తొమ్మిది మంది కార్మికులు ఉండగా, వారంతా జమ్మూ కాశ్మీర్ వెలుపలి ప్రాంతాలకు చెందిన…
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నోతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ సూపర్ విక్టరీ సాధించింది. 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. 166 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ బ్యాటర్లు సునాయాసంగా చేధించారు. ఎస్ఆర్హెచ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా.. లక్నో బౌలర్లపై శివాలెత్తారు. ట్రావిస్ హెడ్ (89*), అభిషేక్ శర్మ (75*) పరుగులతో విరుచుకుపడ్డారు. కేవలం ఫోర్లు, సిక్సులతోనే లీడ్ చేశారు. ట్రావిస్ హెడ్ కేవలం 30 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 8 సిక్సులు…
కాకినాడ జిల్లా తునిలో భర్త గెలుపుకోసం భార్య లక్ష్మీచైతన్య ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తన భర్త తుని వైసీపీ అభ్యర్థి మంత్రి దాడిశెట్టి రాజాకి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు. తుని మండలంలోని వల్లూరు, అగ్రహారం, సీతయ్యపేట గ్రామాలలో ఇంటింటికి వెళ్లి లక్షీచైతన్య ఎన్నికల ప్రచారాన్ని చేసారు. ఈ సందర్భంగా లక్ష్మీచైతన్య మాట్లాడుతూ.. మంత్రి దాడిశెట్టి రాజాని ముచ్చటగా మూడోసారి గెలిపించుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం జగన్ చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకువస్తాయని లక్షీచైతన్య ధీమా వ్యక్తం చేసారు.…
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 165 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. సన్రైజర్స్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఒకానొక సమయంలో 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లక్నో.. ఆ తర్వాత బరిలోకి వచ్చిన ఆయుష్ బడోని లక్నో జట్టుకు ఆయువు పోశాడు. అతనికి తోడు నికోలస్ పూరన్ కూడా రాణించాడు. దీంతో.. లక్నో ఎస్ఆర్హెచ్ ముందు ఫైటింగ్ టార్గెట్ను పెట్టింది.
ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీకి హైకోర్టు నుంచి ఊరట లభించింది. సబ్ జైలు నుండి అడియాలా జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. రెండు కేసుల్లో దోషిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను రావల్పిండిలోని హై సెక్యూరిటీ అడియాలా జైలులో ఉన్నారు. కాగా.. బుష్రా బీబీని ఇస్లామాబాద్ శివారులోని ఇమ్రాన్ ఖాన్ నివాసం బనిగాలాలో ఖైదుగా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడి నుంచి అడియాలా జైలుకు తరలించారు.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొత్తపల్లి, తోటమూల గ్రామాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అందులో భాగంగా.. జనం ప్రభంజనంతో కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు హారతులతో, డాన్సులు వేస్తూ కొలికపూడి శ్రీనివాసరావు ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. మీ సమస్యలను తాను పరిష్కరిస్తాను అంటూ ప్రజలకు మాట ఇస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన లక్నో.. మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ప్రచారం ఊపందుకుంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు సమయం వృధా చేయకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. మద్ధతుగా వారి కుటుంబ సభ్యులు కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ఓ పక్క ప్రచారంలో దూసుకెళ్తుండగా.. మరోపక్క తన చిన్న కోడలు స్వాతి గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ముదినేపల్లి మండలం వాడాలి గ్రామంలో స్వాతి ఇంటింటి ప్రచారం చేశారు. ప్రతీ ఇంటికి వెళ్లి జగనన్న చేసిన మంచి పనులను వివరిస్తూ…
కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ నుంచి బేగంపేట్ వరకు పట్నం సునీత మహేందర్ రెడ్డి పాదయాత్ర, రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీతో సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని పేర్కొన్నారు.