ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో 50 గడపలు ఉన్న ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా.. మంగళవారం దుత్తలూరు మండలం సోమల రేగడ గ్రామంలో మండల నాయకత్వం ఆధ్వర్యంలో కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం కాకర్ల సురేష్ గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ తెలుగుదేశాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి…
దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. కాగా.. ఎన్నికల సంఘం ఎక్కువ మందిని ఓటు వేసేలా ప్రేరేపిస్తోంది. ముఖ్యంగా 2024 ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతను ఈసారి ఓటింగ్ పరిధిలోకి తీసుకొచ్చారు. తొలిసారి ఓటు వేసిన ఉత్సాహంతో పెద్ద సంఖ్యలో యువత పోలింగ్ కేంద్రాలకు వెళ్లి బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ) నుంచి ఫారం 6ను సేకరించి నింపారు. ఒకప్పుడు ఓటు హక్కు వయస్సు 21 సంవత్సరాలు ఉండేది. కానీ 1989లో తొలిసారిగా 21 ఏళ్ల నుంచి 18…
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ శివాలెత్తాడు. సెల్ఫీ కోసం వచ్చిన ఓ అభిమానిపై చిర్రుబుర్రులాడాడు. అంతేకాకుండా.. అతని మెడపట్టి గెంటేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో పలుమార్లు అభిమానులపై చేయిచేసుకున్నాడు షకీబ్. అయితే.. ఈసారి ఏకంగా మెడ పట్టుకుని గెంటేశాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. ధాకా ప్రీమియర్ లీగ్‌లో షేక్ జమాల్ ధన్మోండి క్లబ్ కు షకీబ్ అల్ హసన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో.. టాస్ వేస్తున్న సమయంలో ఓ…
అమెరికాలోని టెక్సాస్‌లో దారుణమైన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సవన్నా క్రీగర్ అనే 32 ఏళ్ల మహిళ తన 3 ఏళ్ల కుమారుడిని కాల్చి చంపి, ఆ తర్వాత తుపాకీతో తనకు తాను కాల్చుకుంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయే ముందు తల్లి ఫోన్లో భయంకరమైన వీడియోను రికార్డు చేసింది. 'మీ తండ్రికి వీడ్కోలు చెప్పు' అంటూ వీడియోలో రికార్డైంది.
టీ20 వరల్డ్ కప్కు సరిగ్గా నెల సమయం కూడా లేదు. ఐపీఎల్ అయిపోయిన వెంటనే.. ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అమెరికా, వెస్టిండీస్ ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్.. జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ ను ఏంచక్కా ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ అభిమానులకు.. మరో పండగ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మెగా టోర్నీని చూసేందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 20 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. కెప్టెన్ సంజూ శాంసన్ ఒక్కడే (86) పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లు బ్యాటింగ్లో రాణించలేకపోయారు. రాజస్థాన్ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (4), జాస్ బట్లర్ (19) పెద్దగా పరుగులు చేయలేదు. రియాన్ పరాగ్ (27), శుభం దూబే (25)…
తిరుపతిలో పవన్ కల్యాణ్, చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. మంగళం లీలామహల్ సెంటర్ మీదుగా గాంధీరోడ్డు వరకు రోడ్ షో చేపట్టారు. అనంతరం.. గాంధీరోడ్డు వద్ద వారాహీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తిరుపతి పవిత్రతను కాపాడటానికి ప్రజలందరు సిద్ధంగా ఉండాలని కోరారు. తనది పునర్జన్మ.. వేంకటేశ్వర స్వామీ తనకు పునర్జన్మ ఇచ్చాడని అన్నారు. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి వారు పోటీ చేసిన గొప్ప చరిత్ర ఉన్న నియోజకవర్గం తిరుపతి అని…
తిరుపతిలో పవన్ కల్యాణ్, చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. మంగళం లీలామహల్ సెంటర్ మీదుగా గాంధీరోడ్డు వరకు రోడ్ షో చేపట్టారు. అనంతరం.. గాంధీరోడ్డు వద్ద వారాహీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గోవిందా.. గోవిందా అంటూ స్పీచ్ మొదలెట్టారు. అన్నీ సర్వేలు కూటమిదే విజయం అంటోందని తెలిపారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ ను ఎమ్మెల్యేగా గెలిపించడం అవసరమా అని ప్రశ్నించారు. పేదలకు సేవ చేసే ఆరిణి…
ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో సీఈఓ ముకేష్ కుమార్ మీనాని వైఎస్సార్సీపీ బృందం కలిసింది. పాణ్యం, అనకాపల్లి సభల్లో సీఎం జగన్ పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు చేసే తప్పుడు ప్రచారాలు, అసభ్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఈసీ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా వ్యవహరిస్తోందని తెలిపారు. పొరుగు రాష్ట్రంలో దుర్భాషలాడిన నేతలపై 48 గంటలు నిషేధం విధించిందని అన్నారు. చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నా చర్యలు…
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం ముల్లేరు గ్రామంలో ప్రచార రథం నుండి ఓటర్లనుద్దేశించి ప్రసంగించారు. గ్రామంలో రాములవారి గుడి ఆవరణలో మాట్లాడుతూ.. కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు శిరస్సువంచి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. అనకాపల్లిలో సోమవారం జరిగిన ప్రధాని బహిరగసభ వేదికపై ప్రధాని నరేంద్రమోడీ తన గెలుపుకు మద్దతుగా తలపై చేయిపెట్టి మనస్పూర్తిగా ఆశీర్వదించారని అన్నారు.