కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు, పెత్తందారులకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. పేదల వైపు ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెత్తందారుల వైపు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని తెలిపారు. అన్ని పార్టీలు కలిసి జగన్కు నష్టం చేయాలని చూస్తున్నాయని అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద పిల్లలు భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తెచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. పేదరికాన్ని తగ్గించడం కోసం పేదలకు అండగా నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వీరిద్దరే పేద ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తులు అని పేర్కొన్నారు. మరోవైపు.. చంద్రబాబు నాయుడు మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ట్రాప్లో ఎవరూ పడొద్దని.. జగనన్న చొరవ వల్లే బద్వేల్ నియోజకవర్గానికి పరిశ్రమలు వచ్చాయని తెలిపారు.
Stock Market: ఆ దెబ్బతో భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్..
చంద్రబాబు దుర్బుద్ధి తేట తెల్లమైంది.. అవ్వ తాతలు, రైతులు, మహిళల ఉసురు చంద్రబాబుకు తగులుతుందని ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకాలన్నీ ఎన్నికల కోడ్కు ముందే అమలు చేసినవి అన్నారు. ఆసరా, విద్యా దీవెన, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రజలకు ఇస్తోందని తెలిపారు. ఈ పథకాలకు నాలుగు నెలల క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి నిధులు విడుదల చేశారని.. ఈ నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వ అధికారులు ఎన్నికల సంఘానికి అనుమతి కోరుతూ లేఖ రాశారన్నారు. ఆ నిధులు ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాల్లో పడుతోందని పేర్కొన్నారు. ఇది ఏ మాత్రం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి రాదని సూచించారు. సర్వ సాధారణంగా జరిగే ప్రక్రియ ఇది అని తెలిపారు. దీనిని కూడా చంద్రబాబు అడ్డుకోవాలని చూడడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, రైతులు, విద్యార్థులు, వృద్ధుల గోడు చంద్రబాబుకు తగులుతుందని దుయ్యబట్టారు. పేదలకు నిధులు రాకుండా అడ్డుకోవడం కుట్రలో భాగమేనని అవినాష్ రెడ్డి తెలిపారు.
Ranveer Singh: షాకింగ్ : దీపికతో వెడ్డింగ్ పిక్స్ డిలీట్ చేసిన రణవీర్ సింగ్?