ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారంలో దూకుడు పెంచారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామాలలో పర్యటిస్తూ.. తమకు ఓటేయాలని కోరుతున్నారు. కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి, ప్రతి గడపకు వెళ్లి తమ పార్టీ అందించే సంక్షేమ పథకాలు, తమ పార్టీకి ఓటు వేయడం ద్వారా భవిష్యత్ లో కలిగే లాభాలను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటేసి.. తనను ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారు.
CNG Bikes: వావ్.. ఇకపై సీఎన్‌జీ బైక్స్.. అప్పుడే మార్కెట్‌లోకి విడుదల..
జగ్గంపేట వైసీపీ అభ్యర్థి తోట నరసింహం ప్రచారంలో స్పీడ్ పెంచారు. గోకవరం మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష కూటమి ఇచ్చే హామీలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మళ్లీ జగన్ సీఎం అయితేనే అభివృద్ధి సంక్షేమం కొనసాగుతుందని పేర్కొన్నారు. జగన్ చేసేదే చెబుతాడని, సాధ్యం కానీ హామీలు ఇవ్వరని గుర్తు చేశారు. పేదలకు పథకాలు అందాలంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావాలని.. కాబట్టి మరోసారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని తోట నరసింహం కోరారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగ్గంపేట అభివృద్ధిలో ముందు ఉందని గుర్తు చేశారు. జగన్ మళ్ళీ సీఎం అయితేనే సంక్షేమం, అభివృద్ధి ఫలాలు పేదలకు అందుతాయని అన్నారు. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి సమస్యలు తీరుస్తామని తోట నరసింహం హామీ ఇచ్చారు.