ఐపీఎల్ 2024లో పాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. కమిన్స్ ప్రదర్శనతో పాటు, చాలా ముఖ్యాంశాల్లో నిలుస్తున్నాడు. తాజాగా.. కమిన్స్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో పాట్ కమిన్స్ దేశీ స్టైల్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు.
శుక్రవారం ఉదయం 10 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నగరి నియోజకవర్గం పుత్తూరులో కార్వేటినగరం రోడ్ కాపు వీధి సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి వైఎస్సార్ కడప జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కడప నగరంలోని మద్రాస్ రోడ్ శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ధర్మశాల వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
టీ20 ప్రపంచ కప్ 2024 కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ మెగా ఈవెంట్‌కు ముందు భారత్ ప్లేయింగ్-11లో ఏ ఆటగాళ్లకు అవకాశం ఇస్తారనే చర్చ తారాస్థాయికి చేరుకుంది. రోహిత్ శర్మతో ఎవరు ఓపెనింగ్ చేస్తారు.. ఏ స్పిన్నర్లకు అవకాశం లభిస్తుందనే దానిపై చాలా మంది అనుభవజ్ఞులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరీ ముఖ్యంగా వికెట్ కీపింగ్ పై ఎక్కువగా చర్చ జరుగుతోంది.
ఎన్నికలకు సమయం మరింత దగ్గర అవుతుంది. ఈ క్రమంలో.. రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తమ నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ వెళ్లి.. తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి చేపడుతామని చెబుతూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా.. అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మొదట తన తండ్రిని గొంతుకోసి చంపాడు. అనంతరం తన 5 ఏళ్ల కొడుకుతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని పాలి ప్రాంతంలో విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి మొదట తన తండ్రిని గొంతు కోసి హత్య చేసి, ఐదేళ్ల కొడుకుతో కలిసి చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు.
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు, మిస్సింగ్స్ ఆగడం లేదు. చదువుల్లో ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా.. తాజాగా మరో విద్యార్థి మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఆ విద్యార్థి.. ఐదేళ్ల పాటు ఇంటికి దూరంగా వెళ్లిపోతున్నానంటూ పేరెంట్స్‌కు మెసేజ్ చేసి అదృశ్యమయ్యాడు. దీంతో పోలీసులు విద్యార్థి జాడ కోసం తీవ్రంగా వెతుకుతున్నారు.
ఢిల్లీలోని పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బేకరీ నిర్వాహకుడిపై ముగ్గురు అన్నదమ్ములు కత్తులతో దాడికి పాల్పడ్డారు. బాధితుడు శశి గార్డెన్‌లో నివాసముంటున్నాడు. అయితే.. తన ఇంటి పక్కన ఉండే అక్రమ్ అనే వ్యక్తి తనపై కార్పొరేషన్‌తో పాటు ఇతర విభాగాల్లో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడని బాధితుడు ఆరోపించాడు. అంతేకాకుండా.. బేకరీ కారణంగా తన ఇల్లు వేడి అవుతుందని.. బేకరీని మూసివేయాలని ఒత్తిడి తెచ్చినట్లు బాధితుడు పేర్కొన్నాడు.
ఎన్నికల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నుంచి 626 ప్రత్యేక సర్వీసులు అందిస్తుంది. అంతేకాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా బెంగళూరు నుంచి 200 ప్రత్యేక సర్వీసులు నడపనుంది. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల నుంచి రెగ్యులర్ సర్వీసులు ఫుల్ కాకపోవడంతో ప్రత్యేక సర్వీసులు లేవు. మరోవైపు.. 10వ తేదీ శుక్రవారం కావడం.. అలాగే శని, ఆది వారాలు సెలవులు ఉండటంతో అత్యధికంగా 199 సర్వీసులు హైదరాబాద్ నుంచి, 95 సర్వీసులు బెంగళూరు నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడిపిస్తుంది…
నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1062.22 పాయింట్లతో 1.45 శాతం తగ్గి 72,404.17 వద్దకు చేరుకుంది. నిఫ్టీ కూడా 335.40 పాయింట్లతో 1.5 శాతం క్షీణించి 21,967.10 వద్ద ముగిసింది.