ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. నేటి ట్రేడింగ్ సెషన్‌లో స్టాక్ మార్కెట్ భారీ పతనంతో ముగిసింది. ఈ క్రమంలో.. సెన్సెక్స్ 1062, నిఫ్టీ 335 పాయింట్లు పడిపోయాయి. దీంతో.. పెట్టుబడిదారులకు భారీ నష్టం ఏర్పడింది. ఈ వారంలో ఇదే అతిపెద్ద పతనం. ఈ రోజు ఉదయం పరిమిత శ్రేణిలో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులు మార్కెట్లో పెరుగుదలను ఆశించారు. అయితే మధ్యాహ్నం ఒంటి గంటకు మార్కెట్‌లో భారీ పతనంతో ట్రేడింగ్ ప్రారంభమైంది.
నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1062.22 పాయింట్లతో 1.45 శాతం తగ్గి 72,404.17 వద్దకు చేరుకుంది. నిఫ్టీ కూడా 335.40 పాయింట్లతో 1.5 శాతం క్షీణించి 21,967.10 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్‌లో ఈ పతనం కారణంగా ఇన్వెస్టర్లు రూ.3 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. దీనివల్ల బిఎస్‌ఇ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 400 లక్షల కోట్ల దిగువన రూ. 393.73 లక్షల కోట్లకు పడిపోయిందని ఇటి నివేదిక తెలిపింది.
Gangs Of Godavari: వెనక్కి వెళ్లిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. ఈసారి ఏకంగా ఐదు సినిమాలతో పోటీ?
టాప్ 30 BSE లిస్టెడ్ షేర్లలో 25 షేర్లలో ఈరోజు భారీ పతనం జరిగింది. కేవలం 5 షేర్లు మాత్రమే పెరిగాయి. టాటా మోటార్స్ షేర్‌లో దాదాపు 2 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.48 శాతం, ఎస్‌బిఐ షేర్‌లో 1.27 శాతం, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్‌లో స్వల్ప పెరుగుదల కనిపించింది. నష్టపోతున్న 25 స్టాక్స్‌లో ఎల్‌అండ్‌టి షేరు 5.56 శాతం క్షీణించింది. దీని తర్వాత.. ఏషియన్ పెయింట్స్, JSW స్టీల్, ITC, బజాజ్ ఫైనాన్స్ మరియు ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 5 శాతం వరకు పడిపోయాయి.
ఎల్ అండ్ టీ షేర్లు ఈరోజు దాదాపు 6 శాతం క్షీణించి రూ.3275కి చేరుకున్నాయి. అంతే కాకుండా.. పవర్ ఫైనాన్స్ షేర్లు 5 శాతం, బిపిసిఎల్ 5 శాతం, పిరమిల్ ఎంటర్‌ప్రైజెస్ 9 శాతం, ఎన్‌హెచ్‌పిసి 5.26 శాతం, మణప్పురం ఫైనాన్స్ 8 శాతం పడిపోయాయి. స్టాక్ మార్కెట్ లో ఈరోజు ఇన్వెస్టర్లు రూ.7.3 లక్షల కోట్లు నష్టపోయారు. ఎందుకంటే గురువారం, బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.7.3 లక్షల కోట్లు తగ్గి రూ.393.73 లక్షల కోట్లకు చేరుకుంది, ఇది అంతకుముందు రోజు రూ.400 లక్షల కోట్ల మార్కులో ఉంది.