టీ20 ప్రపంచ కప్ 2024 కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ మెగా ఈవెంట్‌కు ముందు భారత్ ప్లేయింగ్-11లో ఏ ఆటగాళ్లకు అవకాశం ఇస్తారనే చర్చ తారాస్థాయికి చేరుకుంది. రోహిత్ శర్మతో ఎవరు ఓపెనింగ్ చేస్తారు.. ఏ స్పిన్నర్లకు అవకాశం లభిస్తుందనే దానిపై చాలా మంది అనుభవజ్ఞులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరీ ముఖ్యంగా వికెట్ కీపింగ్ పై ఎక్కువగా చర్చ జరుగుతోంది.
Read Also: Bengaluru: ప్యూరిఫైయర్ సర్వీస్ కోసం వచ్చి మహిళా టెక్కీపై లైంగిక వేధింపులు
సంజు శాంసన్ లేదా రిషబ్ పంత్?లో ఎవరు వికెట్ కీపింగ్ కోసం మొదటి ఎంపికను శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సంజూ శాంసన్‌కి వికెట్ కీపింగ్‌లో తన ఫస్ట్ ఛాయిస్ అని చెప్పాడు. నిజానికి ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ బ్యాట్తో భీకరంగా రాణిస్తున్నాడు. గత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సంజూ.. 46 బంతుల్లో 86 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో శాంసన్ ఇప్పటివరకు 471 పరుగులు చేశాడు. అతని సగటు 67గా ఉంది.
Read Also: Hanu-man: టీవీల్లోనూ అదరగొట్టేసిన హనుమాన్..
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో సంజూ ప్రత్యేక ఆటగాడని.. అతను ఏకాగ్రతతో ఉన్నప్పుడు అతను చేయలేనిది ఏమీ లేదని రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ కుమార సంగక్కర అన్నాడు. అతను వినయపూర్వకమైన, డౌన్ టు ఎర్త్ ప్లేయర్ అని తెలిపాడు. ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తాడని భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. గతంలో కంటే శాంసన్ మరింత పరిణతి సాధించాడని సంగక్కర అన్నాడు. ఈ సీజన్‌లో శాంసన్‌లో ఉన్న గొప్పదనం ఏమిటంటే.. అతను ఎలా బ్యాటింగ్ చేయాలి అనే విషయంలో స్పష్టత ఉందన్నాడు.