అన్ని వర్గాల వారు సీఎం జగన్కు అండగా ఉన్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు కాపు సామాజిక వర్గంను మోసం చేశారని.. కాపులను బీసీ చేస్తానని చేయలేదని ఆరోపించారు. కాపులకు ఏం చేస్తానో చెప్పి.. చేసి చూపించిన వ్యక్తి వైయస్ జగన్ అని అన్నారు. దళితులను జగన్ కు దూరం చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేశారు.. ఆ ప్రయత్నాలు ఫలించలేదని పేర్ని నాని మండిపడ్డారు. బీసీలు కూడా చంద్రబాబు తమను వాడుకుని వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది…
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజవర్గం వీఆర్పురం మండలం మారుమూల గ్రామాలలో ఎన్డీఏ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అరకు పార్లమెంట్ అభ్యర్థిని కొత్తపల్లి గీత, రంప చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష దేవి రోడ్డు షో ప్రచారం నిర్వహించారు. రోడ్డు పొడవునా ప్రజలు బారులు తీరి.. ఆదివాసి గిరిజనులు హారతులతో స్వాగతం పలుకుతున్నారు. ఉమ్మడి పార్టీల అభ్యర్థులతో పాటు.. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా హాజరై నినాదాలు చేశారు.
ఏలూరు జిల్లా కైకలూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో 36 గంటల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోందని తెలిపారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం జరిగే ఎన్నికలు కావని పేర్కొన్నారు. ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపు కోసం జరిగే ఎన్నికలు అన్నారు. జగన్కి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగింపు ఉంటుందని తెలిపారు. ఇంటింటి అభివృద్ది చేసే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని సీఎం జగన్ చెప్పారు. పొరపాటున చంద్రబాబుకి ఓటు వేస్తే పథకాలు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది. 35 పరుగుల తేడాతో గెలుపొందింది. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.
క్రికెట్ మైదానంలో కొన్నిసార్లు ఫన్నీ సీన్లు చూస్తుంటాం. వాటిని చూస్తే నవ్వు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. బంగ్లాదేశ్-జింబాబ్వే మధ్య జరిగిన నాలుగో టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లోనూ ఇలాంటి దృశ్యమే కనిపించింది. జింబాబ్వే ఫీల్డర్లు వికెట్ త్రో కొట్టడానికి పడుతున్న విన్యాసాలను చూస్తే మరీ ఇంత చిన్నపిల్లల్లా ఉన్నారేంట్రా బాబు అని అంటారు. మిడిల్ గ్రౌండ్‌లో చేసిన ఫీల్డింగ్ చూసి మీరు కడుపుబ్బ నవ్వుకుంటారు. కాగా.. జింబాబ్వే ఫీల్డర్ల చిన్నపిల్లల చర్యల వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా కె.పి.హెచ్.బి కాలనీ డివిజన్లో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, కోఆర్డినేటర్ సతీష్ అరోరా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రెండు వేల మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కె.పి.హెచ్.బి కాలనీ రోడ్ నెంబర్ వన్ నుండి మొదలైన బైక్ ర్యాలీ 9వ ఫేస్ వరకు కొనసాగింది. ఈ బైక్ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి మద్దతుగా నిలుస్తూ అడుగున అడుగున స్వాగతం పలికారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యా్చ్లో గుజరాత్ ఓపెనర్స్ చెలరేగారు. ఇద్దరూ సెంచరీలతో అదరగొట్టారు. శుభ్మాన్ గిల్ (104), సాయి సుదర్శన్ (103) సెంచరీలు చేయడంతో గుజరాత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ ముందు 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. గిల్, సుదర్శన్ బ్యాటింగ్ లో ఒకరికొకరు పోటాపోటీగా రన్స్ చేస్తూ వచ్చారు. గిల్ ఇన్నింగ్స్ […]
చియా విత్తనాలు మన ఆరోగ్యకరానికి చాలా మంచిది. ఇవి తింటే శరీరం కూల్ గా ఉంటుంది. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఆరోగ్యకరమైన లక్షణాలు ఉన్నాయి. ఈ గింజలు పుదీనా కుటుంబానికి చెందిన సాల్వియా హిస్పానికమ్ నుండి వస్తాయి. వీటి రంగు ముదురు నలుపు రంగులో ఉంటాయి. చియా విత్తనాలు ప్రోటీన్ యొక్క పవర్‌హౌస్, అనేక ఇతర పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటుంది. చాలా మంది చియా విత్తనాలను తమ రోజువారీ ఆహారంలో భాగంగా వాడుతుంటారు. ఈ విత్తనాలను తినడం వల్ల కలిగే…
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరొకరు గాయపడ్డారు. బలూచిస్థాన్ పోస్ట్‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ ఈ సమాచారం ఇచ్చింది. నివేదికల ప్రకారం.. చాలా కాలంగా కొనసాగుతున్న వివాదం కారణంగా బషీర్ అహ్మద్‌ను గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. డేరా మురాద్ జమాలీలో మొదటి సంఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అహ్మద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు తరలించారు. విచారణ అనంతరం అహ్మద్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటంతో రాజకీయ పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులు ప్రచారంలో జోరు పెంచారు. ఈ క్రమంలో.. ప్రతీ ఇంటికి, ప్రతీ గడపకు వెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కాగా.. కైకలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు అనుపమ ప్రచారం నిర్వహించారు. కైకలూరు మండలం వెలమపేటలో ఇంటింటి ప్రచారం ముమ్మరంగా చేశారు.