నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ఉండనుంది. కానీ.. ఈ మ్యాచ్కు వరుణుడు అడ్డు తగిలేలా ఉంది. హైదరాబాద్ లో బీభత్సమైన వర్షం కురుస్తుంది. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొడుతుంది. ఈ క్రమంలో.. ఈరోజు మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు.. ఈ మ్యాచ్లో గెలిచి ప్లేఆఫ్స్కు వెళ్లాలనుకున్న సన్ రైజర్స్ టీమ్కు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. మరోవైపు.. ఉప్పల్ పరిసరాల్లో వర్షం పడుతుండటంతో సన్ రైజర్స్ అభిమానులు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. ఇంకా 7 బంతులు మిగిలి ఉండాగానే ముగించేసింది.
మే 12న బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు.. పాడైపోయిన ఆహారం తిన్నామంటూ ఆరోపించారు. దీంతో.. బాధితుల ఫిర్యాదు మేరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మేనేజ్‌మెంట్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో కేఎస్‌సీఏ మేనేజ్‌మెంట్, క్యాంటీన్ మేనేజర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
ఒలింపిక్స్ ముందు భారత్ స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రాకు ఇదొక శుభపరిణామం. ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న అతను.. మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన 27వ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. బల్లాన్ని 82.27 మీటర్ల దూరానికి విసిరి పసిడి పతకాన్ని సాధించగలిగాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. పంజాబ్ బౌలర్ల ధాటికి ఆర్ఆర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. చివరి వరకు పోరాడిన రియాన్ పరాగ్ (48) ఒక్కడే అత్యధికంగా స్కోరు చేశాడు. ఈ క్రమంలో.. రాజస్థాన్ ఈ మాత్రం స్కోరు చేసింది. మిగత బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఓపెనర్ జోష్ బట్లర్ లేని వెలితి కనిపిస్తోంది.
106 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు విద్యాబోధన చేస్తున్నారు. యూపీలోని జున్‌వాయి డెవలప్‌మెంట్ బ్లాక్ ప్రాంతంలోని చబుత్రా గ్రామంలో ఓ ప్రాథమిక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు మాత్రమే.. ఒకటి నుండి ఐదవ తరగతి వరకు పిల్లలకు బోధిస్తున్నారు. అయితే.. ఆ పాఠశాలలో అంతమందికి ఒక్కరే ఉపాధ్యాయుడు ఉండటం అతనికి ఇబ్బందే.. ఇటు పిల్లలకు ఇబ్బందే. సరిగా విద్యను బోధించేవారు లేక పిల్లల చదువులకు ఆటంకం ఏర్పడుతోంది.
ప్రముఖ హాస్యనటుడు, యూట్యూబర్ శ్యామ్ రంగీలా అభ్యర్థిత్వాన్ని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా శ్యామ్ రంగీలా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా.. అఫిడవిట్ సమర్పించనందున శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. శ్యామ్ రంగీలా ప్రధాని నరేంద్ర మోడీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగిన సంగతి తెలిసిందే.. శ్యామ్ రంగీలా మిమిక్రీ ఆర్టిస్ట్.. అతను ప్రధాని మోడీ, రాహుల్ గాంధీతో సహా చాలా మంది నాయకులను అనుకరించేవాడు. దీంతో ఆయన పలుమార్లు వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు.
ఈసారి ఐపీఎల్లో ఆర్సీబీ టైటిల్ సాధిస్తుందనే గట్టి నమ్మకం క్రికెట్ అభిమానుల్లో ఉండేది. కానీ.. ఈసారి కూడా టైటిల్ గెలువలేకపోతుంది. సీజన్ ప్రారంభంలో అన్నీ మ్యాచ్ ల్లో ఓడిపోయి.. చివర్లో గెలుస్తూ వస్తున్నారు. కానీ.. ఆర్సీబీకి ప్లేఆఫ్స్ చేరడం కష్టమే. ఈ క్రమంలో.. టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆర్సీబీకి సలహా ఇచ్చారు. భవిష్యత్తులో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవాలంటే.. భారత ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. 17 ఏళ్ల నుంచి వేచి చూస్తున్న ఆర్సీబీ కప్ గెలవాలంటే భారత ఆటగాళ్లపై నమ్మకం…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆర్ఆర్.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
హైవేలపై వెళ్తుంటే మలుపులు వచ్చిన దగ్గరి కాస్త స్లో చేసుకుని వెళ్తాం. అలాంటప్పుడు కాస్త చిరాకు అనిపిస్తుంది. ఎందుకంటే.. మంచి స్పీడ్ లో వచ్చి, మళ్లీ స్లో అయితే గేర్లు మార్చాలి.. మళ్లీ పికప్ అందుకోవడానికి సమయం పడుతుంది. అందుకే డ్రైవింగ్ చేసే వాళ్లు చిరాకెత్తిపోతారు. అదే.. చక్కటి రోడ్డు ఉంటే, హ్యాపీగా బ్రేక్ మీద కాలుపెట్టకుండా, గేర్లు మార్చకుండా వెళ్లొచ్చు. అయితే.. మలుపులు లేని రోడ్లు ఎక్కడో చోట కొంత దూరం ఉంటాయి, కానీ.. సౌధీ అరేబియాలో మాత్రం 256 కి.మీ మలుపులు…