Kerala: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన అంబులెన్స్.. మంటలు చెలరేగి రోగి సజీవదహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని కోజికోడ్‌లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ రోగిని.. అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మంటల్లో కాలిపోయింది. ప్రమాదవశాత్తు అంబులెన్స్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో.. అంబులెన్స్‌లో ఉన్న మహిళా రోగి సజీవ దహనమైంది.
Delhi: ఢిల్లీ ఐటీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 21 ఫైరింజన్లు
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
మృతి చెందిన రోగి సులోచన (58)గా గుర్తించారు. ఆమెను అత్యవసర శస్త్రచికిత్స కోసం మెడికల్ కాలేజ్ ఆసుపత్రి నుండి కోజికోడ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న అంబులెన్స్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని స్థానిక పోలీసులు తెలిపారు. కోజికోడ్ మినీ బైపాస్‌లో ఆస్టర్ మిమ్స్ హాస్పిటల్ సమీపంలో తెల్లవారుజామున 3.50 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.
Sangeeth: నాని డైరెక్టర్ తమ్ముడు హీరోగా రొమాంటిక్ కామెడీ “సంగీత్”!
కాగా.. ఈ ప్రమాదంలో అంబులెన్స్లో మహిళా రోగి, డ్రైవర్‌తో పాటు ఇద్దరు వ్యక్తులు, ఓ డాక్టర్, నర్సు ఉన్నారు. వారు స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకున్నారు. అయితే రోగి మాత్రం కదలలేని పరిస్థితిలో ఉండటం వల్ల అందులోనే ఉండిపోయింది. దీంతో మంటల్లో కాలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మీంచంత అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా ఆస్టర్ మిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
- Tags
- Ambulance
- burnt
- death
- electric pole
- fire
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!