CM Revanth Reddy: రేపటి నుండి పరిపాలన మీద దృష్టి సారిస్తున్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపటి నుండి పరిపాలన మీద దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రుణమాఫీ పై ఫోకస్, విద్యాశాఖ మీద ఫోకస్, అన్ని హస్టల్స్ కి సన్న బియ్యం.. బీఆర్ఎస్ ఇచ్చిన సన్న బియ్యం కాదు.. నిజమైన సన్నబియ్యం ఇస్తామని అన్నారు. త్వరలో బ్యాంకర్ల సమావేశం ఉంటుందన్నారు. రుణమాఫీ పై చర్యలు, రైతుల రుణాలు ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతుల రుణాలు మాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని.. దాని ద్వారా రుణాలు మాఫీ చేసుకోవచ్చని తెలిపారు.
DC vs LSG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో..
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
మరోవైపు.. దేశంలో బీజేపీకి పూర్తి మెజార్టీ రాదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సగం కాంగ్రెస్, సగం బీజేపీకి పోతే బీఆర్ఎస్ పార్టీనే ఉండదని విమర్శించారు. కాగా.. కాంగ్రెస్ పై ఎవరు ఏం విమర్శలు చేసినా పట్టించుకోమన్నారు. తాము 13 సీట్లు గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్ కూడా రాదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పోటీ బీఆర్ఎస్ అని.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పోటీ అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలేనని.. బీఆర్ఎస్ అదే చేస్తుందని అన్నారు.
Flights theft: 200 ఫ్లైట్‌లు ఎక్కాడు.. లక్షల్లో దోచేశాడు.. ఘరానా దొంగ ఎలా దొరికాడంటే..!
నా పరంగా ఎన్నికలు ముగిసాయి.. రేపటి నుండి పరిపాలనపై ద్రుష్టి పెడతానని ముఖ్యమంత్రి తెలిపారు. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర పైనే ఎక్కువ ఫోకస్ ఉంటుందన్నారు. రైతు పండించే వాటిని రేషన్ షాపుల్లో అందించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. మిల్లర్లు మింగి కూసుంటాం అంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. మరోవైపు.. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. విద్యుత్ శాఖలో కొందరు కావాలని పవర్ కట్ చేస్తున్నారని.. వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి.. పూర్తి స్థాయి చర్యలు ఉంటాయన్నారు. మరోవైపు.. రిటైర్డ్ ఉద్యోగుల పై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!