106 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు విద్యాబోధన చేస్తున్నారు. యూపీలోని జున్‌వాయి డెవలప్‌మెంట్ బ్లాక్ ప్రాంతంలోని చబుత్రా గ్రామంలో ఓ ప్రాథమిక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు మాత్రమే.. ఒకటి నుండి ఐదవ తరగతి వరకు పిల్లలకు బోధిస్తున్నారు. అయితే.. ఆ పాఠశాలలో అంతమందికి ఒక్కరే ఉపాధ్యాయుడు ఉండటం అతనికి ఇబ్బందే.. ఇటు పిల్లలకు ఇబ్బందే. సరిగా విద్యను బోధించేవారు లేక పిల్లల చదువులకు ఆటంకం ఏర్పడుతోంది.
Magnetic reversal: భూమి “అయస్కాంత ధృవాలు” రివర్స్ అవుతున్నాయి.. ప్రళయం ముంచుకొస్తుందా..?
ఈ విషయంలో అక్కడి విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ‘గో టు స్కూల్’ అనే నినాదాన్ని ఇస్తూ పిల్లలకు చదువుపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. మరోవైపు పాఠశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కొందరు అధికారులు ఏమీ పట్టించుకోవడం లేదు. జునావాయిలోని చబుత్రా గ్రామంలో ఉన్న పాఠశాల ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో టీచర్ దేవదత్ సింగ్ ఒక్కడే 106 మంది పిల్లలకు చదువు చెప్పే భారాన్ని మోస్తున్నారు. చాలా సంవత్సరాలుగా ఈ పాఠశాలలో మరెవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క టీచర్‌తోనే పాఠశాల నడుస్తోంది. ఒకటో తరగతిలో తొమ్మిది మంది, రెండో తరగతిలో 18 మంది, మూడో తరగతిలో 37 మంది, నాలుగో తరగతిలో 25 మంది, ఐదో తరగతిలో మొత్తం 16 మంది విద్యార్థులు ఉన్నారు.
AP Elections 2024: ఏపీలో కొనసాగుతోన్న టెన్షన్..! ఆ నియోజకవర్గాల్లో 144 సెక్షన్
ఈ పాఠశాలలో చాలా ఏళ్లుగా ఉపాధ్యాయుల కొరత ఉందని ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నానని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి వినోద్ మెహ్రా తెలిపారు. పిల్లల చదువులకు ఆటంకం కలగకుండా జూలై నెల నుంచి మరో ఇద్దరు ఉపాధ్యాయులను ఇక్కడ నియమించనున్నట్లు చెప్పారు. మరోవైపు.. సిబ్బందిని నియమించకపోవడంతో పిల్లలకు చదువులకు ఆటంకం ఏర్పడుతోందని పిల్లల తల్లిదండ్రలుు చెబుతున్నారు. పోస్టులో ఉన్న ఉపాధ్యాయుడు ఏదో ఒక సర్వే లేదా ఇతర ప్రభుత్వ పనుల కోసం ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే పాఠశాలకు తాళం పడుతుందని తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై ఏ అధికారి పట్టించుకోవడం లేదని.. ఇలాంటి పరిస్థితుల్లో తమ పిల్లల చదువులకు ఆటంకం కలుగుతోందని పేరెంట్స్ చెబుతున్నారు.