హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క ట్రాన్స్ జెండర్ ఐకాన్ మాయా ఠాకూర్ తన జీవితంలో పడ్డ కష్టాలను గురించి తెలిపింది. తొమ్మిదో తరగతి తర్వాత బలవంతంగా చదువు మానేయాల్సి వచ్చింది. కాగా.. మాయ ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ ఐకాన్‌గా మారింది. స్కూల్‌లో చదువుకునే రోజుల్లో విద్యార్థులు, టీచర్ల నుంచి తాను ఏకపక్ష ప్రవర్తనను ఎదుర్కొన్నానని ట్రాన్స్‌జెండర్ ఐకాన్ తెలిపింది. దీంతో.. ఆమె పాఠశాల విద్యను పూర్తి చేయలేకపోయిందని చెప్పింది. సిమ్లా పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని సోలన్ జిల్లాలోని కునిహార్ ప్రాంతంలోని కోఠి గ్రామానికి…
ఐపీఎల్ 2024లో భాగంగా.. లీగ్ దశలో చివరి మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన సీఎస్కే.. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఆఫ్ఘనిస్థాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు అక్కడి మీడియా కథనాలు తెలుపుతున్నాయి. పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్‌లోని ఘోర్ ప్రావిన్స్‌లో కుండపోత వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరదలలో సుమారు 68 మంది చనిపోగా.. పదుల సంఖ్యలో ప్రజలు వరదలో గల్లంతైనట్లు సమాచారం. ప్రాథమిక నివేదికల ఆధారంగా మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు తాలిబన్ అధికారి ఒకరు శనివారం తెలిపారు. వరదల కారణంగా జిల్లా భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసిందని.. వేల సంఖ్యలో ఇళ్లు, ఆస్తులు దెబ్బతిన్నాయని…
చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కాసేపట్లో బిగ్ ఫైట్ జరుగనుంది. ఈ రెండు జట్ల మధ్య లీగ్‌లో ఇదే చివరి మ్యాచ్ అయినప్పటికీ ప్లేఆఫ్స్ కారణంగా ఈ మ్యాచ్ హై వోల్టేజ్ మ్యాచ్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. అయితే బెంగళూరు మాత్రం 18 పరుగుల తేడాతో లేదా 18.1 ఓవర్లలో ఛేజింగ్ చేసి గెలిస్తే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ జట్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే..…
పంజాబ్ ముక్త్‌సర్‌లోని గిద్దర్‌బాహాలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన చోటు చేసుకుంది. డేరా సిద్ధ్ బాబా గంగా రామ్ వార్షికోత్సవ కార్యక్రమంలో సిలిండర్ పేలడంతో ఏడుగురు సేవకులకు మంటలు అంటుకున్నాయి. కాగా.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో బటిండాకు రెఫర్ చేశారు. భటిండాకు రెఫర్ చేసిన వారిలో ముగ్గురికి 60-70 శాతం కాలిన గాయాలయ్యాయి. మరోవైపు పేలుడు శబ్ధం విని ఒక్కసారిగా భక్తులు భయాందోళనకు గురయ్యారు.
బెంగళూరులో గత రెండ్రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతుంది. కాగా.. ఈరోజే వర్షం తగ్గుముఖం పట్టింది. అయితే.. ఆర్సీబీ-సీఎస్కే మ్యాచ్ జరుగుతుందా అన్న సస్పెన్స్ కు తెరదించింది. ఆర్సీబీ, సీఎస్కే అభిమానులకు కర్ణాటక వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. కాసేపట్లో జరగనున్న నాకౌట్ మ్యాచ్ కు వర్షం ముప్పు లేదని తెలిపారు. ప్రస్తుతానికి వర్ష సూచనలు లేవు.. రాత్రి వరకు అనుకూల పరిస్థితులే ఉన్నాయని ట్వీట్ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు.. అటు ఆర్సీబీ అభిమానులు, ఇటు సీఎస్కే అభిమానులు చిన్నస్వామి స్టేడియం…
ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే అనుమానాలొచ్చేలా కింగ్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. ధోనీతో ఈరోజు మ్యాచ్ ఆడుతున్నానని.. నాకు తెలిసి మేం కలిసి ఆడటం ఇదే చివరిదేమో అని కోహ్లీ తెలిపారు. వచ్చే సీజన్ లో ధోనీ ఆడుతాడో, ఆడడో.. ఎవరికి తెలుసని పేర్కొన్నారు. అయితే.. ఈ మ్యాచ్ ఫ్యాన్స్ కు పండగేనని, అద్భుతమైన అనుభూతి ఇస్తుందని చెప్పారు. మేమిద్దరం కలిసి భారత్ తరఫున చాలా సంవత్సరాలు ఆడామని.. జట్టును ఎన్నోసార్లు గెలిపించామని విరాట్ కోహ్లీ అన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సారన్‌గఢ్-బిలాయిగఢ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి గొడ్డలి, కత్తితో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని దారుణంగా చంపి, ఆ తర్వాత అతను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు కారణం ప్రేమ వ్యవహారం అని అంటున్నారు. ఈ దారుణ ఘటన సలీహా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాగా.. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దద్దరిల్లింది.
టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ గురించి గానీ.. అతని రికార్డుల గురించి గానీ తెలియని వారు ఎవరుండరు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ ఎన్నో రికార్డులు సాధించాడు. అయితే.. ఇన్ని రికార్డులు, ప్రశంసలు అందుకున్నప్పటికీ రెండు సందర్భాల్లో తన హృదయం బద్దలైందని చెప్పారు. ఇటీవల జియో సినిమా ఇంటర్వ్యూలో పాల్గొన్న విరాట్ కోహ్లీ.. 2016లో జరిగిన ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో తన హార్ట్ బ్రేక్ అయిందని చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ.. "నా జీవితంలో…
ఐపీఎల్ 17వ సీజన్‌లో ఈరోజు కీలక పోరు జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. గత సీజన్లో మే 18న జరిగిన మ్యాచ్ ల్లో ప్రతిసారి గెలుస్తూ వస్తోంది. 2013లో సీఎస్కే, 2014లో సీఎస్కే, 2016లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 2023లో సన్ రైజర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. ఈరోజు జరిగే మ్యాచ్లోనూ ఇదే కొనసాగుతుందని, సీఎస్కేపై గెలిచి తీరుతుందని ఆర్సీబీ ఫ్యాన్స్ ఆశాభావం…