ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆర్ఆర్.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా.. రాజస్థాన్ ఇప్పటికే ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అయింది. మరోవైపు.. పంజాబ్ మాత్రం పేరుకే ఈ మ్యాచ్ ఆడుతుంది.
రాజస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్:
యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, రోవ్మాన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్.
పంజాబ్ ప్లేయింగ్ ఎలెవన్:
ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, రిలీ రోసోవ్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ, సామ్ కర్రాన్ (కెప్టెన్), హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్.