పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో గురువారం వేర్వేరు చోట్ల పిడుగులు పడి 12 మంది మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. మృతుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు చెప్పారు. మరోవైపు.. హరిశ్చంద్రాపూర్‌లో పిడుగుపాటుకు దంపతులు మృతి చెందారు. పొలంలో పనిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా.. పిడుగుపాటుకు గురై మృతి చెందిన.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని జిల్లా మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా ప్రకటించారు. పిడుగుపాటుకు మృతి చెందిన వారికి విపత్తు…
లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. కొలంబో లెజెండ్స్ క్రికెట్ లీగ్ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఇద్దరు భారతీయులను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా.. యోని పటేల్, పి ఆకాష్ పాస్‌పోర్ట్‌లను జప్తు చేయాలని శ్రీలంక కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఇద్దరూ బెయిల్‌పై బయటికి వచ్చారు. అయితే ఈ కేసు విచారణ ముగిసేవరకూ దేశం వదిలి వెళ్లకుండా వారి పాస్‌పోర్ట్‌లను సీజ్ చేయాలని శ్రీలంక కోర్టు ఆదేశించింది. మార్చి 8 నుంచి 19 వరకు క్యాండీలోని పల్లెకెలె స్టేడియంలో…
ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. మధ్యాహ్నం నుంచి హైదరాబాద్లో భారీ వర్షం కురిసినప్పటికీ.. ఉప్పల్ స్టేడియం స్టేడియం పరిసరాల్లో ఇంకా వర్షం పడుతూనే ఉంది. కొద్దిసేపు వర్షం ఆగినప్పటికీ.. మళ్లీ కురుస్తూనే ఉంది. దీంతో.. ఉప్పల్ స్టేడియంలో ఔట్ ఫీల్డ్లో వర్షం నీరు ఇంకా నిలిచి ఉంది. ఔట్ ఫీల్డ్లో నీళ్ళు పూర్తిగా పోవాలంటే సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు.. మ్యాచ్ రద్దు అయితే ఒక పాయింట్ పొంది సన్ రైజర్స్ హైదరాబాద్ నేరుగా ప్లే ఆఫ్…
ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 100 అడుగుల హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. బిల్ బోర్డు శిథిలాలు తొలగిస్తుండగా కారులో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రిటైర్డ్ మేనేజర్ మనోజ్ చన్సోరియా, ఆయన భార్య అనితగా గుర్తించారు.
ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటలపాటు దంచికొట్టింది. ఈ క్రమంలో.. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం భారీగానే పడింది. దీంతో.. స్టేడియం సిబ్బంది పిచ్ తో పాటు గ్రౌండ్ మొత్తం కవర్లతో కప్పి కవర్ చేశారు. మరోవైపు.. కొద్దిసేపటి క్రితమే వర్షం తగ్గగా.. కవర్లను తీసేశారు. అయితే.. గ్రౌండ్ లో ఉన్న నీటిని తీసేయడానికి సిబ్బంది శ్రమించారు. అయితే కాస్త ఆలస్యంగా మ్యాచ్…
ఒరిస్సా నుంచి హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని గురువారం ఉదయం రైల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్ నుంచి ముంబై వెలుతున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగిలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో గంజాయిని పట్టుబడింది. ఖమ్మం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు మహబూబాబాద్ వరకు ప్రయాణించి రెండు సూటు కేసుల్లో అక్రమంగా తరలివెలుతున్న గంజాయిని పట్టుకున్నారు. ఈ గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులు మాత్రం తప్పించుకున్నారు.
బుధవారం స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండుగుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కాల్పుల్లో ప్రధాని గాయపడగా.. తృటిలో ప్రాణాపాయం తప్పింది. అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని రాబర్ట్ ఫికోపై కాల్పులు జరిపిన తర్వాత, ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈశాన్యంగా 150కి.మీ దూరంలో ఉన్న హ్యాండ్‌లోవా పట్టణంలోని తన మద్దతుదారులతో మాట్లాడుతున్న సమయంలో హౌజ్ ఆఫ్ కల్చర్ వెలుపల ఈ దాడి జరిగింది. నాలుగు రౌండ్లు కాల్పులు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
వర్షాలు కురవడం కోసమని క్లౌడ్ సీడింగ్‌ని ఉపయోగించడం గురించి మీరు వినే ఉంటారు. కానీ ఇండోనేషియా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడకుండా ఉండటానికి క్లౌడ్ సీడింగ్‌ను ఉపయోగిస్తున్నారు. నిజానికి, ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి 67 మంది మరణించారు.. మరో 20 మంది గల్లంతయ్యారు. వరదల ధాటికి 44 మంది గాయపడ్డారు. వరదల కారణంగా పలు ఇళ్లు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో 1500 కుటుంబాలు తాత్కాలిక నివాసాలకు వెళ్లారు.
రుణమాఫీ పథకం విధివిధానాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో చర్చించారు. ఖరీఫ్ 2024 నుండి అమలు అయ్యే పంటల భీమా విధివిధానాలపై దిశా నిర్దేశం చేశారు. టెండర్లలో పేర్కొనే నిబంధనలు, ముందుకు వచ్చే కంపెనీలకు ఉన్న అర్హతలు.. మున్నగునవన్నీ ఒకటికి రెండు సార్లు పరిశీలించుకొని, రైతులు పంటనష్టపోయిన సందర్భములో ఈ భీమా పథకం వారిని ఆదుకొనే విధంగా ఉండాలని మంత్రి తెలిపారు. పథక అమలుకు ఆదర్శ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోనికి…
ఈరోజు హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.