అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 6 గంటలకే ప్రారంభమైన కౌంటింగ్.. ఇప్పటికే బీజేపీ సగం మార్కును దాటింది. ఈ క్రమంలో.. బీజేపీ సీఎం అభ్యర్థి పెమా ఖండూ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాగా.. రాష్ట్రంలోని 60 స్థానాల్లో 31 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాగా.. అధికార బీజేపీ ఇప్పటికే 10 అసెంబ్లీ స్థానాలను ఏకపక్షంగా గెలుచుకుంది. మిగతా 50 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది.
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో మధ్యంతర బెయిల్ ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు తీహార్ జైలుకు తిరిగి వెళ్లన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.. అయితే చివరి దశ పోలింగ్ ముగిసిన ఒక రోజు తర్వాత లొంగిపోవాలని కోర్టు తెలిపింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఊరట లభించలేదు.
మణిపూర్‌లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున మణిపూర్‌లోని చందేల్‌లో రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో.. ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ఉదయం ఆరు గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. కాగా.. అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం 60 స్థానాలుండగా.. ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలుపొందింది. మిగిలిన 50 స్థానాలకు నేడు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 133 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న వారిపైకి వ్యాన్ మృత్యువులా పైకి వచ్చింది. దీంతో.. నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం రోజు జరిగింది. ఈ ఘటనపై గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాగా.. ప్రమాదానికి పాల్పడిన వ్యాన్ డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వరదల్లో మరణించిన వారి సంఖ్య 15కి పెరిగిందని.. ప్రభావిత జనాభా సంఖ్య ఆరు లక్షలకు పైగా పెరిగిందని అధికారిక బులెటిన్ శనివారం తెలిపింది. శుక్రవారం నాటికి 11 జిల్లాల్లో బాధితుల సంఖ్య 3.5 లక్షలు అని పేర్కొంది. అయితే.. ప్రభావిత జిల్లాల సంఖ్య 10కి తగ్గిందని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ విడుదల చేసింది. మే 28 నుండి 15 వరకు వరదలు, తుఫానుల కారణంగా కాచర్, హైలకండి,…
గుజరాత్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ఆరావళి జిల్లాలో రెండు బస్సులు భారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మల్పూర్ నుండి వస్తున్న గుజరాత్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు డివైడర్‌ను దాటి మోదసా నుండి మల్పూర్‌కు వెళ్తున్న మరో బస్సును ఢీకొట్టింది. కాగా.. ప్రమాద ఘటనకు సంబంధించి సమీపంలోని ఓ ఇంటి వద్ద ఉన్న సిసిటివిలో రికార్డ్ అయింది.
డ్రగ్స్ను సరఫరా చేసేందుకు స్మగ్లర్లు వినూత్న రీతిలో ఆలోచిస్తున్నారు. డబ్బుల కోసం ఎంతటి సాహాసానికైనా వెనుకాడటం లేదు. అయితే.. ఈసారి స్మగర్లు చిన్న పిల్లల లంచ్ బాక్స్ లో డ్రగ్స్ ను సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ.. ఆ బాక్స్ కస్టమ్ అధికారుల కంటపడింది. అందులో ఏముందోనని తెరిచి చూడగా.. రూ. కోటి కంటే ఎక్కువ విలువ చేసే డ్రగ్స్ లభ్యమైంది.
దేశ వ్యాప్తంగా తీవ్ర ఎండలు, వడగాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 2024 మార్చి 1 నుండి హీట్ స్ట్రోక్‌ల కారణంగా 56 మంది చనిపోయారు. నేషనల్ క్లైమాటిక్ డేటా ప్రకారం.. ఢిల్లీతో సహా అనేక ప్రదేశాలలో మధ్య, తూర్పు మరియు ఉత్తర భారతదేశంలో తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రంలో.. ఒక్క మే నెలలోనే 46 మంది మరణించారు. వాయువ్య, మధ్య మరియు తూర్పు భారతదేశంలో ప్రస్తుతం ఉన్న వేడి తరంగాల పరిస్థితులు రాబోయే 2 నుంచి 3 రోజుల్లో క్రమంగా తగ్గుతాయని…
ఇటీవల కాలంలో విమానాల్లో, విమనాశ్రయాల్లో ఆకతాయిలు బాంబులు పెట్టామని బెదిరింపు కాల్స్ వస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరిస్తున్నారు. మరోవైపు.. ఇప్పటికి వచ్చిన బెదిరింపు కాల్స్ అన్నీ ఫేక్ అని అధికారులు నిర్థారించారు. ఇదిలా ఉంటే.. తాజాగా మరో విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో.. చెన్నై నుండి ముంబైకి వెళ్తున్న ఇండిగో 6E 5314 విమానం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.