పశ్చిమ బెంగాల్‌లో హింస చెలరేగింది. శనివారం జరుగుతున్న లోక్‌సభ చివరి దశ ఎన్నికల్లో వివిధ ప్రాంతాల నుండి చెదురుమదురు హింసాత్మక ఘటనలు మళ్లీ వెలువడుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణ 24 పరగణాల జిల్లా జయనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కుల్తాలి ప్రాంతంలో ఓ ఘటన వెలుగు చూసింది. ఇక్కడి పోలింగ్ బూత్‌లో ఉదయం ఓటింగ్ ప్రారంభమైన తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉన్న కొందరు వ్యక్తులు.. స్థానిక ప్రజలను ఓటింగ్ చేయకుండా నిలిపివేశారని ఆరోపించారు. దీనికి నిరసనగా ఓటింగ్ ప్రారంభమైన 20 నిమిషాల్లోనే…
దేశ వ్యాప్తంగా ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో అయితే నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గతంలో ఎప్పుడు లేనంత ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా నాగ్‌పుర్‌లో ఓ వాతావరణ స్టేషన్‌లో గురువారం ఏకంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. దీంతో.. జనాలు బెంబెలెత్తిపోయారు. అయితే.. అధికంగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో వాతావరణ శాఖ అధికారులు రీసెర్చ్ చేసి నిజం కాదని తేల్చింది. ఉష్ణోగ్రతను నమోదు చేసే సెన్సర్ సరిగా…
ఢిల్లీలోని కశ్మీర్ గేట్ మెట్రో పోలీస్ స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం గురించి ఢిల్లీ అగ్నిమాపక శాఖకు అర్ధరాత్రి 12:45 గంటలకు పోలీసులు సమాచారం అందించారు. కాగా.. మంటలను అదుపు చేసేందుకు కనీసం 12 అగ్నిమాపక దళ వాహనాలను ఘటనాస్థలికి తరలించారు.
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా.. గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శనివారం ఉదయం 7 గంటలకు ఓల్డ్ గోరఖ్‌పూర్ లోని గోరఖ్‌నాథ్ (బాలికలు) బూత్ నంబర్ 223లో ఓటు వేశారు. తన ఓటు హక్కును వినియోగించుకుని తన ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఆయన తన బూత్‌లో తొలి ఓటు వేశారు. అంతకు ముందు.. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2022 అసెంబ్లీ ఎన్నికలు, 2023 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తన బూత్‌లో మొదటి ఓటు వేశారు.
మధ్యప్రదేశ్‌లోని బేతుల్ గ్రామంలో పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. డీజే వాహనం ఢీకొని మైనర్ బాలికతో సహా ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని తంగ్నా మల్ గ్రామం నుంచి ప్రారంభమైన భరాత్.. గురువారం రాత్రి జమూధన గ్రామానికి చేరుకోగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
భారతదేశంలోని అనేక రాష్ట్రాలు తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వడదెబ్బ కారణంగా డజన్ల కొద్దీ మరణించారు. తాజాగా.. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రాల్లో మోహరించిన దాదాపు 20 మంది ఎన్నికల సిబ్బంది హీట్‌స్ట్రోక్‌కు గురయ్యారు. మే నెలలో ఉష్ణోగ్రత రికార్డులను బద్దలు కొట్టిన ఢిల్లీ.. బుధవారం 79 సంవత్సరాల గరిష్ట స్థాయి 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
కర్ణాటకలో జూన్ 1 నుంచి 5 రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర శాసన మండలి ఎన్నికల ఫలితాల కారణంగా జూన్ మొదటి వారంలో కనీసం ఐదు రోజుల పాటు కర్ణాటకలో మద్యం అమ్మకాలు నిషేధించారు. కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలకు ఓటింగ్, జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న క్రమంలో.. జూన్ 1 నుంచి 4 వరకు మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. శాసన మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 6న కూడా…
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో విపరీతమైన ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వేడిమి కారణంగా గ్యాస్ పేలుడు సంభవించి ఐదుగురు మరణించారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం పోలీసులు సమాచారం అందించారు. సింధ్‌లోని హైదరాబాద్ ప్రాంతంలోని ఓ దుకాణంలో గ్యాస్ సిలిండర్ వేడి కారణంగా పేలిపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రోజు మరణించారని.. మంటల్లో గాయపడిన మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎగ్జిట్ పోల్స్ పై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా.. రేపు సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126 ఏ (1) ప్రకారం నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. కాగా.. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.
సెక్స్ టేపుల కుంభకోణంలో ఇండియా నుంచి జర్మనీ వెళ్లిపోయిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున ఇండియాకు వచ్చాడు. బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు అక్కడే అరెస్ట్ చేశారు. కాగా.. ప్రజ్వల్ రేవణ్ణను సాధారణ వైద్య పరీక్షల కోసం నగర ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత రిమాండ్ విచారణ కోసం కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో 6 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో రేపటి నుంచి 6 రోజుల పాటు ప్రజ్వల్ రేవణ్ణను…