సస్పెన్షన్‌కు గురైన జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లి, ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. మైసూరు జిల్లాలోని కేఆర్ నగర్‌లో ఓ మహిళ కిడ్నాప్‌కు సంబంధించిన కేసులో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కోడలు భవానీ బుధవారం ముందస్తు బెయిల్‌ను కోరింది. ఈ క్రమంలో ఆ పిటిషన్‌ను స్థానిక కోర్టు తిరస్కరించింది.
బకాయిలు చెల్లించలేదని ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. కర్ణాటక రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ (KRIDL) పూర్తి చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని ఆరోపిస్తూ కాంట్రాక్టర్ సూసైడ్ చేసుకున్నాడు. దావణగెరెకు చెందిన కాంట్రాక్టర్ ప్రసన్న (50) సంతాబెన్నూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మనోవేదనలను వివరిస్తూ ఓ సూసైడ్ నోట్ రాశాడు.
ఒడిశాలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రూర్కెలాలోని హేమ్‌గిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్తాలీ వ్యాలీలో ప్రమాదవశాత్తు బొలెరో వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా కార్మికులు అక్కడికక్కడే మరణించారు.. వాహనం డ్రైవర్ సహా మరో ఏడుగురికి గాయలయ్యాయి. ఉదయం కూలీలు పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ట్యాక్సీ రైడర్ అవతారమెత్తి ఓ దొంగ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఓలా ట్యాక్సీ రైడర్‌గా ఉంటూ.. ప్రయాణికుల వద్ద నుంచి పలు వస్తువులను కొట్టేసేవాడు. తాజాగా.. ఓ మహిళ బ్యాగ్‌తో పారిపోయి పోలీసులకు చిక్కాడు. ఆ బ్యాగ్‌లో ఐఫోన్, ల్యాప్‌టాప్‌తో పాటు ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సాయంత్రం నోయిడా ఎక్స్‌టెన్షన్‌లోని సొసైటీలో నివసిస్తున్న అధీరా సక్సేనా అనే మహిళ ఓలా బైక్‌ను బుక్ చేసింది. బైక్ పై ప్రయాణం చేసి తన గమ్యస్థానం వచ్చి బైక్ నుండి…
సెక్స్ టేపుల కుంభకోణంలో ఇండియా నుంచి జర్మనీ వెళ్లిపోయిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఈరోజు తెల్లవారుజామున ఇండియాకు వచ్చాడు. బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రజ్వల్ రేవణ్ణను పోలీసుల అక్కడే అరెస్ట్ చేశారు. కాగా.. ప్రజ్వల్ రేవణ్ణను కాసేపటి క్రితం సిట్ తమ ఆధీనంలోకి తీసుకుని సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో.. ప్రజ్వల్ రేవణ్ణను కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ అధికారులకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రేపటి నుంచి 6 రోజుల పాటు ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అధికారులు విచారించనున్నారు. అందులో…
దేశంలోని 150 ప్రధాన రిజర్వాయర్ల నీటిమట్టం 23 శాతానికి పడిపోయింది. గత ఏడాది కంటే ఈ ఏడాది 77 శాతం తక్కువగా ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత నిల్వ గత సంవత్సరం స్థాయిలలో 77 శాతం తక్కువగా ఉందని.. సాధారణ నిల్వలో 94 శాతం ఉంటుందని సీడబ్ల్యూసీ డేటా పేర్కొంది. శుక్రవారం విడుదల చేసిన సీడబ్ల్యూసీ బులెటిన్‌లో.. "అందుబాటులో ఉన్న మొత్తం ప్రత్యక్ష నిల్వ 41.705 బిలియన్ క్యూబిక్ మీటర్లు (BCM), ఇది మొత్తం సామర్థ్యంలో 23 శాతానికి…
ఎయిమ్స్ పరిశోధనలో కీలక విషయాలు బయటికొచ్చాయి. చనిపోయిన మనిషి నుండి శిశువు జన్మిస్తుందని పరిశోధనలో వెల్లడించింది. భోపాల్‌లోని ఎయిమ్స్‌లో నిర్వహించిన పరిశోధనలో చనిపోయిన వ్యక్తి శరీరం నుంచి సేకరించిన శుక్రకణాలు పంతొమ్మిదిన్నర గంటలపాటు జీవించగలవని తేలింది. దీంతో ఏ స్త్రీ అయినా తల్లి కాగలదు అని చెప్పారు.
ఢిల్లీలో ఎండలతో పాటు తీవ్రమైన వేడిగాలులు అక్కడి ప్రజానీకాన్ని బెంబెలెత్తిస్తున్నాయి. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఎండలు బీభత్సం సృష్టి్స్తున్నాయి. తాజాగా.. మొన్నటికి మొన్న ఢిల్లీలోని ముంగేష్ పురిలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. ఈ క్రమంలో.. జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జనాలతో పాటు జంతువులు, పక్షులు ఎండలకు అలమటిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టు ఆవరణలో నివసించే జంతువులు, పక్షులకు తగిన ఆహారం, నీటి సరఫరా తప్పనిసరిగా ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ ఆదేశించారు.
విమానాలు ఆలస్యమై ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే సంఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిరిండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. గురువారం (మే 30) దేశ రాజధాని ఢిల్లీ నుండి బయలుదేరాల్సిన ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో విమానం కొన్ని కారణాల వల్ల 24 గంటలు ఆలస్యమైంది. ఈ క్రమంలో డీజీసీఏ ఈ చర్య తీసుకుంది.
దేశంలో విమానాశ్రయాల్లో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా.. ఢిల్లీ-శ్రీనగర్ విస్తారా విమానానికి బాంబు బెదిరింపుల కాల్ వచ్చింది. శుక్రవారం నాడు 177 మంది ప్రయాణికులు, ఒక శిశువుతో శ్రీనగర్‌కు బయలుదేరిన విస్తారా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో.. విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే.. విమానయాన సంస్థ, భద్రతా బలగాలు చర్యలు తీసుకున్నాయి. ఎలాంటి ప్రమాదం జరగకుండా.. ఢిల్లీ నుండి బయలుదేరిన ఫ్లైట్ నెం-UK-611.. సుమారు రాత్రి 12:10 సమయంలో శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.