ముంబైలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం కశ్మీరా ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఓ కంపెనీ తమ ఉద్యోగులకు క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించింది. అందులో పాల్గొన్న ఓ వ్యక్తి బంతిని గట్టిగా కొట్టాడు. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే.. అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునేలోపే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడు రామ్ గణేష్ తేవార్‌గా గుర్తించారు.
తీవ్ర ఎండలతో దేశ రాజధాని ఢిల్లీలో నీటి ఎద్దడి నెలకొంది. నీటి కొరత నేపథ్యంలో ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి అతిషి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీలకు లేఖ రాశారు. వర్షాకాలం వచ్చే వరకు ఢిల్లీకి నెల రోజుల పాటు నీటిని విడుదల చేయాలని కోరారు. ఢిల్లీ ఈ ఏడాది అత్యంత నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, గత సంవత్సరాల్లో కాకుండా ఈ ఏడాది నీటి డిమాండ్ చాలా రెట్లు పెరిగిందని అతీషి చెప్పారు. ఢిల్లీ వాసులు నీటి…
శనివారం లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి చివరి దశ ఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలో సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అందులో అన్నీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుగుణంగా వచ్చాయి. ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. వివిధ టీవీ ఛానెళ్ల ఎగ్జిట్ పోల్స్‌లో సైతం బీజేపీ ఏకపక్షంగా విజయం సాధిస్తోందని పేర్కొన్నాయి. ఈ క్రమంలో.. ఎగ్జిట్ పోల్స్ పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు.
అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్య గొంతు కోసి హత్య చేశాడు భర్త. ఈ ఘటన భోపాల్ లో చోటు చేసుకుంది. అనంతరం మృతదేహాన్ని తన ఆటోలో తీసుకెళ్లి.. తగులబెట్టి.. భోపాల్‌లోని డంప్ యార్డ్ సమీపంలో పాతిపెట్టాడు. ఈ ఘటన మే 21న జరిగింది. కాగా.. భర్త నదీమ్ ఉద్దీన్ ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అనంతరం.. పాతిపెట్టిన మృతురాలి శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలకు పంపినట్లు పోలీసులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ లో చివరిదశ ఎన్నికల్లో హింస చెలరేగింది. శనివారం నదియాలో బీజేపీ కార్యకర్త కాల్చి చంపారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే బీజేపీలో చేరిన హఫీజుల్ షేక్‌ను టీ స్టాల్ వద్ద ఓ వ్యక్తి కాల్చి చంపాడు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించగా.. పరారీలో అతని కోసం వెతుకుతున్నారు. మృతుడు షేక్ పై దాడి చేసిన వారిలో ఇద్దరు నిందితులను గుర్తించారు. వారిద్దరిపై క్రిమినల్ రికార్డులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
బెంగళూరులో నిన్న (శనివారం) భారీ వర్షం కురిసింది. రాబోయే ఐదు రోజుల పాటు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో.. ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు.. నగరంలో అనేక ప్రదేశాలలో నీరు ఎక్కడికక్కడా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూన్ 2 (ఆదివారం) నుండి జూన్ 4 (మంగళవారం) వరకు బెంగళూరులో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. జూన్ 5, 6 తేదీల్లో వర్షం…
లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈరోజు (ఆదివారం) ముఖ్యమైన అంశాలను కవర్ చేసే సుమారు 7 సమావేశాలను నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి సారించి, రెమల్ తుఫాను అనంతర పరిస్థితిని సమీక్షించే సమావేశంతో ప్రారంభం కానుంది.
శనివారం బీహార్లో చివరి దశ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. అయితే.. పోలింగ్ రోజున కేంద్రమంత్రి రామ్ కృపాల్ యాదవ్ కాన్వాయ్ పై దుండగులు గత రాత్రి తుపాకీ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు కేంద్రమంత్రి పాట్లీపుత్ర పార్లమెంటరీ నియోజకవర్గంలోని మసౌర్హి ప్రాంతంలో ఉన్నారు.
సెక్స్ స్కాండల్ కేసులో జేడీ(ఎస్) నేత ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నేతృత్వంలో అతన్ని విచారిస్తున్నారు. 6 రోజుల కస్టడీకి తీసుకున్న సిట్.. ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు సహకరించడం లేదని.. వరుసగా రెండు రోజుల పాటు సిట్ ప్రశ్నలకు రేవణ్ణ తప్పించుకునే సమాధానాలు ఇచ్చారని మీడియా వర్గాలు తెలిపాయి. ఈ కేసు తనపై కుట్రతో జరిగిందని.. తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రజ్వల్ రేవణ్ణ చెబుతున్నారు. దీంతో…
తేలికపాటి వర్షం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఎండల నుండి ఉపశమనం పొందారు. వరుసగా ఆరు రోజులుగా తీవ్రమైన వేడిగాలుల తర్వాత.. శనివారం దేశ రాజధానిలో వాతావరణం కొద్దిగా మారిపోయింది. ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నం కాసేపు సూర్యరశ్మి ఉన్నప్పటికీ మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మళ్లీ ఆకాశం మేఘావృతమై ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు తేలికపాటి వర్షం కురిసింది. దీంతో.. ఆరు రోజుల తర్వాత శనివారం వేడిగాలుల నుండి కొంత ఉపశమనం లభించింది.