దేశ వ్యాప్తంగా తీవ్ర ఎండలు, వడగాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 2024 మార్చి 1 నుండి హీట్ స్ట్రోక్‌ల కారణంగా 56 మంది చనిపోయారు. నేషనల్ క్లైమాటిక్ డేటా ప్రకారం.. ఢిల్లీతో సహా అనేక ప్రదేశాలలో మధ్య, తూర్పు మరియు ఉత్తర భారతదేశంలో తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రంలో.. ఒక్క మే నెలలోనే 46 మంది మరణించారు.
వాయువ్య, మధ్య మరియు తూర్పు భారతదేశంలో ప్రస్తుతం ఉన్న వేడి తరంగాల పరిస్థితులు రాబోయే 2 నుంచి 3 రోజుల్లో క్రమంగా తగ్గుతాయని భారత వాతావరణ శాఖ (IMD) శుక్రవారం తెలిపింది.
Rajasthan : 15 ఏళ్ల బాలికపై 4 రోజుల పాటు అత్యాచారం.. నిందితులకు 20ఏళ్ల జైలు
ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాలలో 50 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జనాలు తీవ్ర వేడిమితో అల్లాడిపోతున్నారు. రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ మరియు విదర్భలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45-48 డిగ్రీల సెల్సియస్‌లో నమోదవుతున్నాయి. అలాగే.. ఈ రోజు పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లోని అనేక ప్రదేశాలలో, ఉత్తరాఖండ్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో మరియు హిమాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని చాలా ప్రదేశాలలో తీవ్రమైన వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Indian 2 : నేడే గ్రాండ్ ఆడియో లాంచ్ …స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనున్న చిత్ర యూనిట్..
రానున్న 2-3 రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో వేడిగాలులు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని IMD తెలిపింది. రానున్న 4-5 రోజుల్లో ఈశాన్య భారతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. “వచ్చే 3 రోజులలో వాయువ్య మరియు మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్‌కు క్రమంగా తగ్గే అవకాశం ఉంది.” అని IMD తన తాజా బులెటిన్‌లో పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ఈశాన్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలైన త్రిపుర, మేఘాలయ మరియు అస్సాంలోని మిగిలిన భాగాలు, ఉపహిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలోని చాలా ప్రాంతాలలోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం నాడు.. నైరుతి రుతుపవనాలు దాని షెడ్యూల్ ప్రారంభానికి ఒక రోజు ముందు కేరళ మీదుగా ప్రారంభమయ్యాయి. అవి.. ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలకు చేరుకున్నాయి.