బెంగాల్‌లో ఓటింగ్ ముగిసిన తర్వాత కూడా హింస కొనసాగుతోంది. శనివారం రాత్రి నుంచి పలుచోట్ల బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడికి కారణం తృణమూల్ కాంగ్రెస్ (TMC) మద్దతుదారులేనని బీజేపీ ఆరోపిస్తుంది. కాగా.. వరుస దాడులతో భయాందోళనకు గురైన పలువురు బీజేపీ కార్యకర్తలు ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. మరి కొందరు పార్టీ కార్యాలయాల్లో తలదాచుకున్నారు.
రేపు (మంగళవారం) లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. రేపు ఫలితాలు వెలువడిన తర్వాత ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలపై చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వర్గాలు తెలిపాయి. కాగా.. కూటమి నేతలు సమావేశం రేపు సాయంత్రం లేదా బుధవారం జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
రాజస్థాన్లోని జుంజును జిల్లాలో ఓ అత్యాచార నిందితుడు పోలీసుల కస్టడీలో మృతిచెందాడు. ఈ క్రమంలో.. ఎస్‌హెచ్‌ఓ సహా ఎనిమిది మంది పోలీసులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. మే 29న మాండ్రేల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీంతో పోలీసులపై వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ అత్యాచారం కేసులో కోట్‌పుట్లీకి చెందిన గౌరవ్ శర్మ (30) అనే నిందితుడిని జైపూర్‌లో మే 24న అరెస్టు చేశారు. కాగా.. మరుసటి రోజు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్ట్…
ఆరు వారాల పాటు కొనసాగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్.. శనివారం ముగిసింది. కాగా.. అదే రోజు ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుగుణంగా ఉన్నాయి. మూడోసారి అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అయితే రేపు (మంగళవారం) నేతల భవితవ్యం బయటపడనుంది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.
కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తన వాదనలను నిరూపించేందుకు ఈసీని వారం రోజుల సమయం కావాలని కోరారు. దానికి ఎన్నికల సంఘం నిరాకరించింది. జూన్ 4న జరగనున్న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు 150 మంది జిల్లా మేజిస్ట్రేట్లు, కలెక్టర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని జైరాం రమేష్ ఆరోపించారు. ఈ క్రమంలో ఈసీ.. వాస్తవ వివరాలను బయటపెట్టాలని కోరింది. ఆదివారం సాయంత్రం లోగా వివరాలు తెలియజేయాలని తెలిపింది. కాగా.. అందుకు వారం రోజుల గడువు ఇవ్వాలని సోమవారం ఈసీకి లేఖ రాశారు.
కర్నాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ మతగురువు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లాలో దెయ్యం పట్టిందనే నెపంతో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో.. మతగురువును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు స్వస్థలం ఉత్తరప్రదేశ్ కాగా.. స్థానిక మసీదులో ఉంటున్నాడు. అయితే.. బాలిక మూడేళ్లుగా ఖురాన్ అధ్యయనాలకు హాజరవుతూ ఉంటుంది.
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఎన్‌కౌంటర్ జరిగింది. సోమవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో మరణించిన ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని.. వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈరోజు తెల్లవారుజామున పాకిస్తాన్ లష్కరే తోయిబాకు చెందిన.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన ఇద్దరు కమాండర్లు, వారు రహస్య ప్రదేశంలో ఓ ఇంటిలో తలదాచుకున్నట్లు సమాచారం అందిందని భద్రతా అధికారులు తెలిపారు.
పాక్ గూఢచర్య సంస్థ (ఐఎస్‌ఐ) కోసం గూఢచర్యం చేసినందుకు గాను అధికారిక రహస్యాల చట్టం కింద బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్‌కు నాగ్‌పూర్ జిల్లా కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది. అగర్వాల్‌కు 14 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష (RI) మరియు రూ. 3,000 జరిమానా కూడా విధించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 66 (ఎఫ్), అధికారిక రహస్యాల చట్టం (ఓఎస్‌ఎ)లోని వివిధ సెక్షన్ల కింద శిక్షార్హమైన నేరానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 235…
విద్యార్థినిల ఫొటోలు మార్ఫింగ్ చేసి వాట్సాప్‌లో ప్రచారం చేస్తున్న నలుగురు ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. విద్యార్థినులంతా ఒకే కాలేజీకి చెందిన వారు కాగా.. నలుగురు యువకులు కూడా అదే కాలేజీలో పూర్వ విద్యార్థులు. కాగా.. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ విద్యార్థిని తండ్రి మే 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం భారీ వర్షం కురిసింది. గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం తడిసిముద్దైంది. ఈ క్రమంలో.. బెంగళూరు నగరానికి మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన రెండు రోజుల్లోనే.. బీభత్సమైన వర్షం కురిసింది. ఈ క్రమంలో.. జూన్‌లో ఒక్క రోజులో కురిసిన అత్యధిక వర్షపాతంతో 133 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.