కర్నాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ మతగురువు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లాలో దెయ్యం పట్టిందనే నెపంతో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో.. మతగురువును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు స్వస్థలం ఉత్తరప్రదేశ్ కాగా.. స్థానిక మసీదులో ఉంటున్నాడు. అయితే.. బాలిక మూడేళ్లుగా ఖురాన్ అధ్యయనాలకు హాజరవుతూ ఉంటుంది.
Read Also: Maharashtra: పూణె తరహాలో మరో కారు బీభత్సం.. ముగ్గురు మృతి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికకు ఆరోగ్యం బాగా లేని సమయంలో తన ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత తనకు దెయ్యం పట్టిందని.. అది ఒదిలించుకోవాలంటే శృంగారం వల్ల నయం అవుతుందని బాలిక సోదరుడిని నమ్మించాడు. ఆ తర్వాత మతగురువు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. ఈ తతంగమంతా గత ఆరు నుండి ఏడు నెలలుగా నడుస్తుంది. వారానికోసారి అత్యారానికి పాల్పడేవాడు. అయితే.. బాలికకు తీవ్ర కడుపునొప్పి రావడంతో తల్లి ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం.. బాలిక తల్లికి వివరాలు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: Mamitha: పాపం… మమితా బైజుకి చేదు అనుభవం.. పాపని ఏం చేద్దామనుకున్నార్రా? అసలు!
కాగా.. ఈ ఘటన గురించి బాధితురాలి తల్లి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో.. నిందితుడిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అంతేకాకుండా.. పోక్సో చట్టం కింద మతగురువు, సోదరుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు చిత్రదుర్గ ఎస్పీ ధర్మేందర్ కుమార్ మీనా తెలిపారు.