మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జబల్‌పూర్ జిల్లాలో రైల్వే ఉద్యోగి, అతని భార్య వారి ఇద్దరు పిల్లలతో సహా కదులుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం ఉదయం భేదాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహోడా గ్రామంలో జరిగింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ నేమా తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రం గౌతం నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. విజయ్ అనే యువకుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. నగరంలోని అమ్మ వెంచర్లో స్నేహితులతో కలిసి విజయ్ క్రికెట్ ఆడుతుండగా.. గుండెపోటు వచ్చింది. దీంతో గమనించిన తోటి స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించే లోపు యువకుడు విజయ్ మృతి చెందాడు.
ఏసీ శాసనసభ రద్దు అయింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ రద్దు చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. జగన్ తన పదవి రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలపడంతో 15వ అసెంబ్లీ రద్దు అయింది. కాగా.. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఈనెల 9వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.
2024 ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఎన్డీఏ విజయం సాధించింది. కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. కాగా.. ఈ ఎన్నికల్లో కొందరు ముఖ్యమైన ఓటమిపాలైతే.. మరికొందరు తొలిసారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టనున్నారు. కాగా.. నిన్న గెలిచిన వారిలో కాంగ్రెస్ ఎంపీగా సంజనా జాతవ్ కూడా ఉన్నారు. ఈమె ఇండియాలో అతిపిన్న వయస్సు గల ఎంపీ.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున విజయం సాధించింది. సంజనా జాతవ్ వయస్సు (25). జాతవ్ 51,983 ఓట్లతో బీజేపీ…
ఆంధ్రప్రదేశ్లో కూటమి భారీ విజయం సాధించింది. ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన ప్రభంజనం సృష్టించింది. ఈ సందర్భంగా.. టీడీపీ నేతలు విజయానందంలో మునిగితేలుతున్నారు. కాగా.. విజయంపై కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని నిలుపుకుంటామని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ పై నమ్మకంతో ప్రతిపక్షమే లేని మెజార్టీని ప్రజలు ఇచ్చారని తెలిపారు.
ఎన్డీఏలో ఉండి కేంద్రం సపోర్టు చేస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ఎమ్మె్ల్యే కామినేని శ్రీనివాస్ తెలిపారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్.. రాష్ట్ర నాయకులను కలిసి ముచ్చటించారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా.. కామినేని శ్రీనివాస్ను రాష్ట్ర నాయకులు అంబికా కృష్ణ, జి. మధుకర్, వేటుకూరి సూర్యనారాయణ రాజు శాలువ కప్పి సత్కరించారు. ఈ క్రమంలో.. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ విజయం ప్రజలు ఇచ్చిన ప్రజావిజయం అని అన్నారు.
దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె, భారతీయ జనతా పార్టీకి చెందిన బన్సూరి స్వరాజ్ విజయం సాధించారు. న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె.. 78,370 ఓట్ల తేడాతో ఆప్‌కి చెందిన సోమనాథ్ భారతిపై విజయం సాధించారు. ఔట్‌గోయింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్థానంలో తొలిసారిగా ఎమ్మెల్యే బన్సూరిని బీజేపీ రంగంలోకి దించింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. మూడోసారి అదే ఫార్ములా కంటిన్యూ చేయనుంది.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వరుసగా మూడోసారి గెలిచారు. నాగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థిపై 1,37, 603 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాగా.. కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ ఠాక్రేకు 5,17,424 ఓట్లు రాగా, నితిన్ గడ్కరీకి 6,55,027 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి యోగేశ్ లంజేవార్ 19,242 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా.. నోటాకు 5,474 ఓట్లు వచ్చాయి.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్.. బీజేపీ అభ్యర్థి సీఎన్ మంజునాథ్ చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో.. కర్ణాటకలో అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాగా.. డీకే సురేష్ బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఏకైక కాంగ్రెస్ అభ్యర్థి అయిన మూడుసార్లు ఎంపీగా గెలిచిన శివకుమార్‌కు ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు.
ఉత్తర ప్రదేశ్ అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మపై ఓడిపోయారు. మొదటి రౌండ్ నుంచి ఇక్కడ ఆమె వెనుకంజలోనే కొనసాగారు. గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే అమేథిలో స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఓడించారు. దీంతో ఈసారి కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగా ఇందిరా గాంధీ కుటుంబానికి విధేయుడైన కిశోరీ లాల్ శర్మను అమేథీ నుంచి బరిలోకి దింపింది. ఇక అమేథీ నుంచి గెలుపు ఖాయమని మొదటి నుంచీ ధీమాగా ఉన్న స్మృతి ఇరానీకి…