లోక్సభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈరోజు వెలువడిన ఎన్నికల ఫలితాలు ప్రజల ఫలితాలని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఇది ప్రజల విజయం. ఈ పోరాటం మోడీ వర్సెస్ పబ్లిక్ అని ఖర్గే పేర్కొన్నారు.
2024 లోక్సభ ఎన్నికల్లో దేశంలో అత్యంత హాట్‌స్టేట్ సీట్లలో ఒకటైన వారణాసి సీటు ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి నరేంద్ర మోడీ ఇక్కడ నుంచి మూడోసారి గెలుపొందారు. కాగా.. ఈరోజు వారణాసిలో కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తొలి రౌండ్ నుంచి మోడీ వెనుకంజలో ఉన్నారు. ఆ తర్వాత.. పుంజుకోగా 1.5 లక్షలకు పైగా ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.
కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా విజయం సాధించారు. గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానంలో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి సోనాల్ రమణ్‌భాయ్ పటేల్‌పై 7 లక్షల ఓట్ల ఆధిక్యతతో అఖండ విజయం సాధించారు. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం.. అమిత్ షాకు మొత్తం 10,109, 72 ఓట్లు రాగా, పటేల్‌కు 2,66,256 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మరోసారి జయకేతనం ఎగురవేశారు. కేరళలోని తిరువనంతపురంలో తన సమీప బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై 15 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడి నుంచి శశిథరూర్ గెలవడం వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం.
లోక్సభ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ.. మెజారిటీ మార్కును తాకేలా కనిపించడం లేదు. మరోవైపు.. కాంగ్రెస్ కూడా 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే.. హింసాకాండతో చెలరేగిన మణిపూర్లోని రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. మరోవైపు.. బీజేపీ, ఎన్‌పీఎఫ్‌లు తమ స్థానాలను కోల్పోయేలా కనిపిస్తున్నాయి.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సుఖోయ్ ఫైటర్ జెట్ మంగళవారం ఓ పొలంలో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఈ ప్రమాదం భారీ నుంచి పైలట్, కో-పైలట్ ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. స్వల్ప గాయాలు కావడంతో వారిని హెచ్‌ఏఎల్ ఆసుపత్రికి తరలించారు. శిరస్‌గావ్ గ్రామ సమీపంలోని పొలంలో విమానం క్రాష్ అయిందని నాసిక్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ డీఆర్ కరాలే తెలిపారు. Read Also: Stock market: ఆశలు ఆవిరి.. మార్కెట్ చరిత్రలో […]
దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కాగా.. బీజేపీ లీడ్లో కొనసాగుతుండగా, ఇండియా కూటమి కూడా తగిన పోటీనిస్తుంది. ఇదిలా ఉంటే.. ఎన్నికలకు ముందు అయోధ్య నిర్మాణం చేపట్టిన బీజేపీ.. తాము అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేస్తుంది. కాగా.. అదే ప్రాంతంలో బీజేపీ వెనుకంజలో ఉంది. రామమందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ వెనుకంజలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయోధ్య నగరం గతంలో ఫైజాబాద్ జిల్లాలో ఉంది.
లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు SBSP అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ ఇండియా కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌లు బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఎన్డీయే మిత్రపక్షం ఓం ప్రకాష్ రాజ్‌భర్ ఉత్తరప్రదేశ్‌లోని లోక్‌సభ స్థానంలో పోటీ చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీ ఆధిక్యాన్ని సమర్ధిస్తూ.. జూన్ 8న ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని రాజ్‌భర్ తెలిపారు. మరోవైపు.. బీజేపీ గెలుపు ఖాయమని కూటమి నేతలు దుబాయ్, ఇటలీలకు బయలుదేరి వెళ్లారని అన్నారు.
2019 అత్యాచారం, హత్య ఘటనలో నాగ్ పూర్ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302, IPC సెక్షన్ 376(A)(B), ఫొక్సో చట్టం కింద నిందితుడు సంజయ్ పూరి (32)కి జిల్లా జడ్జి, అదనపు సెషన్స్ జడ్జి SR పడ్వాల్ మరణశిక్ష విధించారు. వివరాల్లోకి వెళ్తే.. 2019 డిసెంబర్ 6న లింగ గ్రామంలోని వ్యవసాయ భూమి వద్ద బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఉంది. అయితే.. నిందితుడు అక్కడికి చేరుకుని అత్యాచారం చేసి హత్య చేశాడు. ఒక గుడ్డ నోట్లో కుక్కి..…
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఓ క్రైస్తవుడిని కొట్టి చంపారు. దైవదూషణ ఆరోపణలపై గత వారం హింసాత్మక గుంపు క్రైస్తవ వృద్ధుడిపై దాడి చేసింది. ఈ క్రమంలో ఆయన మరణించినట్లు సోమవారం పోలీసులు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. రాడికల్ ఇస్లామిస్ట్ తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్తాన్ (TLP) కార్యకర్తలు సర్గోధా జిల్లాలోని ముజాహిద్ కాలనీలో ఉండే.. క్రైస్తవ సంఘ సభ్యులపై దాడి చేశారు. ఇద్దరు క్రైస్తవులను, 10 మంది పోలీసులపై దాడి చేశారు. కాగా.. ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా.. క్రైస్తవుల ఇళ్లను, ఆస్తులను…