పాక్ గూఢచర్య సంస్థ (ఐఎస్‌ఐ) కోసం గూఢచర్యం చేసినందుకు గాను అధికారిక రహస్యాల చట్టం కింద బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్‌కు నాగ్‌పూర్ జిల్లా కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది. అగర్వాల్‌కు 14 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష (RI) మరియు రూ. 3,000 జరిమానా కూడా విధించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 66 (ఎఫ్), అధికారిక రహస్యాల చట్టం (ఓఎస్‌ఎ)లోని వివిధ సెక్షన్ల కింద శిక్షార్హమైన నేరానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 235 ప్రకారం.. అగర్వాల్‌ను దోషిగా నిర్ధారించినట్లు అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎంవి దేశ్‌పాండే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Also: Pictures Morphed: విద్యార్థినిల ఫొటోలు మార్ఫింగ్.. నలుగురు అరెస్ట్
నాగ్‌పూర్‌లోని కంపెనీ క్షిపణి కేంద్రంలో సాంకేతిక పరిశోధన విభాగంలో అగర్వాల్ ఉద్యోగం చేస్తున్న అగర్వాల్ ను 2018లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ మరియు యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ (ATS) సంయుక్త ఆపరేషన్‌లో అతన్ని అరెస్టు చేసింది. ఈ క్రమంలో.. అతనిపై భారత శిక్షాస్మృతి, కఠినమైన OSAలోని వివిధ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. కాగా.. అగర్వాల్ బ్రహ్మోస్ ఫెసిలిటీలో నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. ఈ క్రమంలో.. పాకిస్తాన్ యొక్క ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కి సున్నితమైన సాంకేతిక సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
Read Also: Heavy Rain: బెంగళూరులో భారీ వర్షం.. 133 ఏళ్ల రికార్డు బద్దలు
బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి రూపకల్పన, అభివృద్ధి మరియు మార్కెటింగ్‌కు బాధ్యత వహిస్తున్న బ్రహ్మోస్ ఏరోస్పేస్.. భారతదేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO).. రష్యా యొక్క సైనిక పారిశ్రామిక కన్సార్టియం NPO మషినోస్ట్రోయెనియా మధ్య జాయింట్ వెంచర్. కాగా.. అగర్వాల్‌కు గత ఏప్రిల్‌లో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. తాజాగా.. నాగ్‌పూర్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది.